Sharada Peetham | శారదా పీఠం విషయంలో తప్పు జరిగింది.. కమ్యూనికేషన్ గ్యాప్‌తోనే నోటీసులిచ్చారన్న మంత్రి శ్రీధర్ బాబు
Sharada Peetham | కోకాపేట్‌లోని శ్రీశారదా పీఠం భూముల విషయంలో తప్పు జరిగిందని, కమ్యూనికేషన్ గ్యాప్‌తో జరిగిన ఈ విషయం తెలిసిన వెంటనే పొరపాటును సరిదిద్దుకున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు.
Sharada Peetham | మణికొండ, మార్చి 1 : కోకాపేట్‌లోని శ్రీశారదా పీఠం భూముల విషయంలో తప్పు జరిగిందని, కమ్యూనికేషన్ గ్యాప్‌తో జరిగిన ఈ విషయం తెలిసిన వెంటనే పొరపాటును సరిదిద్దుకున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. తమ ప్రభుత్వానికి భేషజాలు లేవని, తప్పులు దొర్లితే వెంటనే సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఆదివారం కోకాపేట్‌లోని శారదా పీఠాన్ని సందర్శించి, అకడి రాజశ్యామల అమ్మవారి ఆలయం, ఇతర నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. అనంతరం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమాచార లోపం వల్లే గందరగోళం తలెత్తిందని, ఆ భూములు పీఠానికే చెందుతాయని, అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని స్పష్టంచేశారు. పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున అన్నిరకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాపు ఘాట్ అభివృద్ధి విషయంలో ప్రజాభీష్టం మేరకే ముందుకెళ్తామని, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని స్థానికులకు మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు.
సానుకూల నిర్ణయం సంతోషకరం: స్వాత్మానందేంద్ర
ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ.. కోకాపేటలో నిర్మితమవుతున్న రాజశ్యామల అమ్మవారి దేవాలయాన్ని మరోచోటకు తరలిస్తారనే వార్త మాకు మీడియా ద్వారానే తెలిసిందని, వెంటనే ముఖ్యమంత్రికి లేఖ ద్వారా అర్జీ పెట్టామని తెలిపారు. విశాఖ శ్రీశారదాపీఠం ఆంధ్రప్రదేశ్‌లో కొలువుదీరి ఉంటే, అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ ప్రజలకు కూడా అవసరమనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండెకరాల భూమిని కేటాయించారని స్వామీజీ గుర్తుచేశారు. ఈ ప్రాంతవాసులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలనే సత్సంకల్పంతో ఆలయ నిర్మాణం శరవేగంగా కొనసాగుతుందని తెలిపారు. ఆదివారం మంత్రి శ్రీధర్‌బాబు తనను కలిశారని, కమ్యూనికేషన్ గ్యాప్‌తోనే ఆలయాన్ని తొలగిస్తారన్న నిర్ణయం తీసుకున్నారని, దీనిపై ముఖ్యమంత్రి వివరణ తర్వాత ఈ భూములు శారదాపీఠానివేనని స్పష్టంచేశారని వెల్లడించారు. ఎనిమిది గంటల వ్యవధిలోనే సమస్యను సానుకూలంగా పరిష్కరించడం సంతోషంగా ఉందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

