Mamata Banerjee | ‘నేను ప్రాణాలు కోల్పోయేదాన్ని’.. కాన్వాయ్ దాడిపై మమతా బెనర్జీ
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కాన్వాయ్‌పై దాడి జరిగింది. నిరసనకారులు ఆమె వాహనంపై రాళ్లు, చెప్పులు విసరడంతో పాటు బురద చల్లారు. అయితే ఈ దాడిలో తన ప్రాణాలు పోయేవని మమతా బెనర్జీ ఆరోపించారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కాన్వాయ్‌పై దాడి జరిగింది. నిరసనకారులు ఆమె వాహనంపై రాళ్లు, చెప్పులు విసరడంతో పాటు బురద చల్లారు. అయితే ఈ దాడిలో తన ప్రాణాలు పోయేవని మమతా బెనర్జీ ఆరోపించారు. (Mamata Banerjee) బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పోలీస్ కస్టడీలో మరణించిన టీఎంసీ కార్యకర్త బిర్జు కెయోట్ కుటుంబాన్ని కలిసేందుకు మమతా బెనర్జీ శనివారం హలిసహర్కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఆమెకు నిరసన సెగ ఎదురైంది. కొంతమంది వ్యక్తులు మమతా బెనర్జీ వాహనాన్ని చుట్టుముట్టారు. ఇటుకలు, రాళ్లతో ఆ వాహనంపై దాడి చేశారు. దానిపై బురద కూడా చల్లారు. ‘దొంగను తరిమికొట్టండి’ అన్న నినాదాలు కూడా వినిపించాయి.
కాగా, తన వాహనంపై దాడి తర్వాత మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. ఈ దాడిలో తాను ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎదురైందని ఆమె ఆరోపించారు. తనపై ఇటుకలు, రాళ్లు పడి ఉంటే ప్రాణాలు కోల్పోయే దానినని అన్నారు. ‘పోలీసుల ముందే బయటి నుంచి వచ్చిన సంఘవిద్రోహులు నా కారుపై రాళ్లు విసిరారు. నా కారు కిటికీలు మూసి ఉండకపోతే, ఆ ధాటికి నా తల పగిలిపోయేది. నేను చనిపోయి ఉండేదాన్ని. ఇంతటి దాడిని నేను ఎప్పుడూ ఎదుర్కోలేదు. మమ్మల్ని కాపాడటానికి పోలీసులు ఏమీ చేయలేదు. వాళ్లు కేవలం బీజేపీకి మాత్రమే రక్షణ కల్పిస్తారు’ అని ఆమె ఆరోపించారు. మమతా బెనర్జీ వెంట ఉన్న లోక్‌సభ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, రాజ్యసభ ఎంపీ డోలా సేన్ కూడా బీజేపీ ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
মমতা ব্যানার্জির উপর হামলা। তীব্র নিন্দা করছি। পুলিশ হেফাজতে নিহত কর্মীর বাড়ি যাচ্ছিলেন নেত্রী। তাঁকে বাধা, গাড়িতে ইঁট, পাথর। এটা কোন্ রাজত্ব? পুলিশ এসব দুষ্কৃতী জমায়েত হতে দিল কী করে?
Attack on @MamataOfficial pic.twitter.com/DHz3vTZFOh— Kunal Ghosh (@KunalGhoshAgain) August 9, 2026
#WATCH | Barrackpore: Former West Bengal Chief Minister Mamata Banerjee says, “Large stones were hurled at my car by anti-social elements,right in front of the police. The attack on the vehicle was so severe that if the windows had been open, my head would have been split open.… pic.twitter.com/PIdFM1Oxcr
— ANI (@ANI) August 9, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- alleges
- Attack
- car
- Could Have Died
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

