Jobs | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కేంద్ర ప్రభుత్వానికి ఉద్యోగ నియామక సంస్థ. ఈ సంస్థ
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ (CHSL)-2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 2536 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిని వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, ట్రిబ్యునళ్లు, ఇతర వాటిలో నింపనున్నారు. ఇంటర్ పాసైనవారినుంచి దరఖాస్తులను కోరుతుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది. అక్టోబర్ 7 వరకు కొనసాగుతుంది.
పోస్టులు
లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)/జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ (JSA)
డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)
గ్రేడ్ ‘ఎ’ డేటా ఎంట్రీ ఆపరేటర్
పై పోస్టుల్లో ఈ 2536 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు
మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రబ్యూషన్, SSC, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్‌లోని డీఈవో/డీఈవో గ్రేడ్ ‘ఎ’ పోస్టులకు మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా సైన్స్ విభాగంలో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు కావాలి. మిగతా డిపార్ట్మెంట్, మినిస్ట్రీల్లోని ఎల్డీసీ/జేఎస్ఏ, డీఈవో/డీఈవో గ్రేడ్ ‘ఎ’ పోస్టులకు ఇంటర్ లేదా తత్సమాన కోర్సు పాసై ఉండాలి.

Ssc Posts
వయసు
ఈ ఏడాది అక్టోబర్ 1 నాటికి 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. 1999, ఆగస్టు 2 నుంచి 2008, ఆగస్టు 1 మధ్య జన్మించి ఉండాలి. ఓబీసీలకు 3, ఎస్సీ, ఎస్టీలకు 5, దివ్యాంగులకు 15 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
దరఖాస్తు
అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ. 100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్సర్వీస్మెన్లకు ఫీజు లేదు.
ఎంపిక
టైర్-1, టైర్-2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్‌ల ద్వారా ఎంపిక చేస్తారు.
టైర్-1 ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్‌ల నుంచి 25 ప్రశ్నల చొప్పున 100 ప్రశ్నలు, 200 మార్కులకు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్‌లో భాగంగా ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల కోత విధిస్తారు.
టైర్-2 రెండు సెషన్లలో ఉంటుంది. మొదటి సెషన్లో సెక్షన్-1 (మ్యాథమెటిక్స్, రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30 ప్రశ్నల చొప్పున 60 ప్రశ్నలు, 180 మార్కులు), సెక్షన్-2 (ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 40, జనరల్ అవేర్నెస్ 20 60 ప్రశ్నలు,180 మార్కులు), సెక్షన్-3 (కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ 15 ప్రశ్నలు, 45 మార్కులు) ఉంటాయి. రెండో సెషన్లో సెక్షన్-4 (పార్ట్-ఎ డీఈవో డిపార్ట్మెంట్స్ స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్, పార్ట్-బి ఇతర డీఈవో డిపార్ట్మెంట్స్, పార్ట్-సి LDC/JSAలకు టైపింగ్ టెస్ట్) ఉంటుంది. సెక్షన్-1, 2, 3లో నెగెటివ్ మార్కింగ్‌లో భాగంగా ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు.

Chsl
జీతం
ఎంపికైనవారికి ఎల్డీసీ/జేఎస్ఏ (లెవల్-2)లకు రూ. 19,900 నుంచి రూ. 63,200, డీఈవో (లెవల్-4)లకు రూ. 25,500 నుంచి రూ. 81,100, డీఈవో (లెవల్-5)లకు రూ. 29,200 నుంచిరూ. 92,300, డీఈవో గ్రేడ్-ఎ (లెవల్-4)లకు రూ. 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది.
చివరితేదీ
అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ అక్టోబర్ 7. ఇతర వివరాలకు వెబ్సైట్ https://ssc.gov.in/ చూడండి.