PM Modi | ఢిల్లీ చేరుకున్న పుతిన్.. నేడు ప్రధాని మోదీతో భేటీ.. ద్వైపాక్షిక చర్చలు
PM Modi : శనివారం నుంచి ప్రారంభం కానున్న బ్రిక్స్ సదస్సు కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కేవీ సింగ్, ఇతర ఉన్నతాధికారులు పుతిన్‌కు స్వాగతం పలికారు.
PM Modi : శనివారం నుంచి ప్రారంభం కానున్న బ్రిక్స్ సదస్సు కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కేవీ సింగ్, ఇతర ఉన్నతాధికారులు పుతిన్‌కు స్వాగతం పలికారు. పుతిన్ తన పర్యటన సందర్బంగా ప్రధాని మోదీతో శుక్రవారం భేటీ కానున్నారు.
రష్యా-ఇండియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల పెంపునకు, సహకారానికి, రక్షణ, ఎనర్జీ, టెక్నాలజీ, ఫార్మా, వ్యాపారం, వాణిజ్యం వంటి రంగాలపై చర్చలు జరుపుతారు. మోదీ, పుతిన్ చర్చల అనంతరం కీలక ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. ప్రధానంగా ఇరు దేశాల మధ్య చెల్లింపులకు సంబంధించిన మెకానిజం, సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. శనివారం నుంచి అధికారికంగా బ్రిక్స్ సదస్సు ప్రారంభమవుతుంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ బ్రిక్స్ సదస్సు కోసం వేరే దేశం రావడం ఇదే మొదటిసారి.
ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా, ఇండోనేసియా అధ్యక్షుడు ప్రాబోవో సుబియాంటో, ఈజిప్టియన్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తాహ్ ఎల్ సిసి, మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహిం, అబుదాబి రాజు ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇథియోపియన్ ప్రధాని అబియ్ అహ్మద్ అలి, వియత్నం ప్రధాని లె మిన్స్ హుంగ్ వంటి నేతలు హాజరుకానున్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఈ సదస్సు కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

