DC Movie | తమిళ దర్శకుడు అరుణ్ మాథేశ్వరణ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ‘డీసీ’ (DC) సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర విజయాన్ని పురస్కరించుకుని దర్శకుడు అరుణ్ మాథేశ్వరణ్, కథనాయకుడిగా నటించిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌లకు నిర్మాత కళానిధి మారన్ బ్రాండ్-న్యూ బీఎండబ్ల్యూ (BMW) కార్లను కానుకగా అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మరోవైపు ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన వామికా గబ్బికి ఈ గిఫ్ట్ ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఈ చిత్రంలో లోకేశ్ ‘దేవదాస్’ పాత్రలో, వామికా గబ్బి ‘చంద్ర’ పాత్రలో నటించి మెప్పించారు. సినిమా విజయంతో కోర్ టీమ్‌కు కార్లు బహుమతిగా ఇవ్వడంపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నప్పటికీ, ప్రధాన నాయిక అయిన వామికా గబ్బిని ఈ సత్కారం నుంచి విస్మరించడం పట్ల నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు ఆమె కూడా ఒక ప్రాణం, మరి ఆమెకు కారు ఎందుకు ఇవ్వలేదు? అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Mr. Kalanithi Maran congratulated and presented the keys to brand-new BMW cars to Arun Matheswaran, Lokesh Kanagaraj and Anirudh, for the success of Blockbuster #DC! 💥@Dir_Lokesh @ArunMatheswaran @anirudhofficial #DCMegaBlockbuster pic.twitter.com/QOgmCA6ZqI
— Sun Pictures (@sunpictures) September 10, 2026