Laser lights | కళ్లపై లేజర్ లైట్లు పడటంతో తడబడ్డ పైలట్.. గాల్లో చక్కెర్లు కొట్టిన విమానం
Laser lights | విమానం ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో పైలట్ (Pilot) ను లేజర్ లైట్లు (Laser Lights) ఇబ్బందులకు గురిచేశాయి. దాంతో విమానాన్ని కిందికి దించకుండా అలాగే గాల్లో చక్కర్లు కొట్టించారు. రెండో ప్రయత్నంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయం (Kolkata International Airport) లో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
Laser lights : విమానం ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో పైలట్ (Pilot) ను లేజర్ లైట్లు (Laser Lights) ఇబ్బందులకు గురిచేశాయి. దాంతో విమానాన్ని కిందికి దించకుండా అలాగే గాల్లో చక్కర్లు కొట్టించారు. రెండో ప్రయత్నంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయం (Kolkata International Airport) లో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
విమానాశ్రయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం 159 మంది ప్రయాణికులతో కౌలాలంపూర్ నుంచి కోల్‌కతాకు వచ్చింది. కోల్‌కతా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపించడంతో పైలట్లు ల్యాండింగ్‌కు సిద్ధమయ్యారు. అయితే రన్‌వేకు ఎనిమిది నాటికల్ మైళ్ల (దాదాపు 15 కి.మీ.) దూరంలో ఉన్నప్పుడు మధ్యమ్‌గ్రామ్-బరసాత్ వైపు నుంచి విమానం కాక్‌పిట్ దిశగా అకస్మాత్తుగా ప్రకాశవంతమైన లేజర్ కాంతులు వచ్చాయి.
ఈ అనుకోని పరిణామంతో పైలట్ తడబడ్డారు. విమానాన్ని అలాగే గాల్లో చక్కర్లు కొట్టించి కాసేపటికి సురక్షితంగా ల్యాండ్ చేశారు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం విమానయాన సంస్థ ఈ విషయాన్ని ఎయిర్‌పోర్టు అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దాంతో ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కోల్‌కతా విమానాశ్రయ డైరెక్టర్ విక్రమ్ సింగ్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

