హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత , మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) ను నాచారం గుట్ట శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం ప్రతినిధులు కలిశారు. ఈ నెల 8 నుంచి 19 వరకు జరిగే బ్రహ్మ్మోత్సవాలకు హాజరు కావాలని కోరుతూ శుక్రవారం ఆహ్వాన పత్రికను , స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భగా ఆలయ అర్చకులు కేసీఆర్ను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రవీందర్ , ఈవో రంగాచారి , అర్చకులు పాల్గొన్నారు.