Aadarsha Kutumbam | వెంకటేష్ – త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’.. జెన్‌జీ కూతురు పాత్రను పరిచయం చేసిన మేకర్స్!
Aadarsha Kutumbam | విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ (AK47) నుంచి చిత్రబృందం మరో ఆసక్తికర గ్లింప్స్‌ను విడుదల చేసింది.
Aadarsha Kutumbam | విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ (AK47) నుంచి చిత్రబృందం మరో ఆసక్తికర గ్లింప్స్‌ను విడుదల చేసింది. రోజుకో కొత్త వీడియోతో సినిమా ప్రచారాన్ని వేగవంతం చేస్తున్న మేకర్స్, తాజాగా ఈ చిత్రంలో వెంకటేష్ కూతురిగా, చిట్టిబాబు గారాలపట్టిగా నటిస్తున్న సంపూర్ణ (యువినా పార్థవి) పాత్రను పరిచయం చేశారు.
పరిచయమైన ప్రతి ఒక్కరితో ప్రేమలో పడే జెన్‌జీ కూతురి పాత్రలో సంపూర్ణ కనిపించబోతుంది. ఇక త్రివిక్రమ్ మార్క్ సంభాషణలు, వినోదాత్మక ఘట్టాలతో నిండిన ఈ వీడియో సోషల్ మీడియాలో సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో నారా రోహిత్, నివేతా పేతురాజ్, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

