Gatta Kusthi 2 | తమిళ టాలెంటెడ్ నటుడు విష్ణు విశాల్, కథానాయిక ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన స్పోర్ట్స్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గట్టా కుస్తీ 2′(మట్టి కుస్తీ) డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో మంచి స్పందనతో బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ (Netflix) ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులను దక్కించుకుంది. ఈ క్రమంలోనే సినిమాను జూలై 31 నుంచి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారిక ప్రకటించింది.
ఈ చిత్రాన్ని కేవలం తమిళ భాషకే పరిమితం చేయకుండా, తెలుగు, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ చేయనున్నారు. దర్శకుడు చెల్లా అయ్యావు దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్లో సీనియర్ నటి రమ్యకృష్ణ, ప్రముఖ హాస్య నటుడు యోగి బాబు, కరుణాకరన్ తదితరులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. మొదటి భాగం మాదిరిగానే ఈ రెండో భాగం కూడా థియేటర్లలో మంచి వినోదాన్ని మరియు కుటుంబ భావోద్వేగాలను పంచింది.
Indha round 2 la kadhal ah? Illa kusthi ah? 😎🥰 pic.twitter.com/9btlQzihj3
— Netflix India South (@Netflix_INSouth) July 29, 2026