ఇంఫాల్: మణిపూర్ మళ్లీ పేలుళ్లతో దద్దరిల్లింది. సోమవారం తెల్లవారుజామున మూడు పేలుళ్లు సంభవించాయి. మైతీ కుటుంబం వీడి పోయిన ఇంట్లో ఐఈడీలు పేలాయి. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. (IED blasts rock Manipur) మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సైటన్-న్గానుకాన్ ప్రాంతంలోని మైతీ కుటుంబం వదిలి వెళ్లిన ఇంట్లో సోమవారం తెల్లవారుజామున ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైసెస్ (ఐఈడీ)లు పేలాయి. ఉదయం 5.40 గంటల సమయంలో మొదటి పేలుడు, 5.55 గంటలకు రెండో పేలుడు జరిగింది. ఉదయం 8.30 గంటల సమయంలో మూడో పేలుడు సంభవించింది.
కాగా, పేలుడు శబ్దాలకు స్థానిక నివాసితులు భయాందోళన చెందారు. ఐఈడీలు పేలిన ఇంటిని కొందరు వ్యక్తులు పరిశీలించారు. ఈ సందర్భంగా రెండో పేలుడు సంభవించడంతో ఒక మహిళ, ఒక వ్యక్తి గాయపడ్డారు. కుకీలు ఈ పేలుళ్లకు పాల్పడినట్లు స్థానికులు ఆరోపించారు.
మరోవైపు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) భద్రతా పరిధిలో ఉన్న ప్రాంతంలో ఈ పేలుళ్లు జరుగడం కలకలం రేపింది. భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మరిన్ని పేలుడు పదార్థాలు అక్కడ ఉన్నాయా? అన్నది తనిఖీ చేశారు. ఈ పేలుళ్లకు కారణం ఏమిటన్నది దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Leopard Attacks Farmer | రైతుపై చిరుత దాడి.. బావిలో పడి ఇద్దరూ మృతి
Watch: హైవే డివైడర్‌పై థార్‌తో డేంజరస్ స్టంట్లు.. తర్వాత ఏం జరిగిందంటే?