మణిపూర్‌లో తాజాగా రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా, మరొకరు గాయపడ్డారు. బిష్ణుపూర్ జిల్లాలోని నరైన్‌సెన్‌లో మంగళవారం రెండు మిలిటెంట్ వర్గాలు భారీ స్థాయిలో కాల్పులు జరుపుకున్నాయి.
మణిపూర్‌లో ఒక పక్క జాతుల విద్వేషం కారణంగా హింసాత్మక చర్యలతో అట్టుడుకుతుండగా, మరోవైపు అక్కడ శాంతి భద్రతలు నిర్వహిస్తున్న అస్సాం రైఫిల్స్‌పై పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.