భూదాన్ పోచంపల్లి, మార్చి 13 : పట్టుపురుగుల పెంపకం రైతులకు ఎంతో లాభాదాయకమని సెరీకల్చర్ (Sericulture) సీనియర్ శాస్త్రవేత్త, మైసూర్ డాక్టర్ దయానంద్ అన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ప్రాంతీయ పట్టు పరిశ్రమ కేంద్రం, సెంట్రల్ సిల్క్ బోర్డ్ ములుగు సిద్దిపేట జిల్లా, రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ సంయుక్తంగా నిర్వహించిన పట్టు కృషి మేళా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
పట్టు కృషి మేళా కార్యక్రమానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టుపురుగుల పెంపకంలో నాణ్యమైన మల్బరీ ఆకు, మంచి వాతావరణం పరిస్థితులు రీలింగ్ కండిషన్ ఉంచుకోవాలని సూచించారు. పట్టుపురుగుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలను ఆయన వివరించారు. మట్టి పరీక్ష నుంచి పట్టుపురుగుల పెంపకం, మల్బరీ ఆకులు పెంపకంలో జాగ్రత్తలు.. వంటివి సూచించారు. పట్టు పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఉత్పత్తి చేసిన పట్టుతో, నూతన ఆవిష్కరణలతో అధిక లాభాలు పొందే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. తెలంగాణలోని రైతులు, వీవర్లు, రీలర్లు ‘ఖుషి మేళా థీమ్’లో ప్రతి ఏటా ఇన్నో మిషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో సందర్భంగా సుమారు 500 మంది రైతులు, వీవర్స్ రీలర్స్ పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెరీకల్చర్ జాయింట్ డైరెక్టర్ లత, వరంగల్ సెరీకల్చర్ జాయింట్ డైరెక్టర్ అనసూయ, ప్రముఖ శాస్త్రవేత్తలు మైసూర్ జోయి, శత రాణి, డాక్టర్ మల్లికార్జున్, జిల్లా హ్యాండ్లూమ్ ఏ డీ శ్రీనివాసరావు, ప్రాంతీయ పట్టు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వినోద్ కుమార్, రాఘవేందర్, రైతులు వీవర్లు, రీలర్లు పాల్గొన్నారు.