RR vs GT | అర్ధ శతకాలతో మెరిసిన జురెల్, యశస్వీ.. గుజరాత్ ముందు కొండంత లక్ష్యం..!
RR vs GT : అహ్మదాబాద్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) టాపార్డర్ దంచేసింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(55), ధ్రువ్ జురెల్(75) అర్ధ శతకాలతో గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ దళాన్ని కకావికలం చేశారు.
RR vs GT : అహ్మదాబాద్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) టాపార్డర్ దంచేసింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(55), ధ్రువ్ జురెల్(75) అర్ధ శతకాలతో గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ దళాన్ని కకావికలం చేశారు. వైభవ్ సూర్యవంశీ(31)తో కలిసి మెరుపు ఆరంభమిచ్చిన యశస్వీ.. జురెల్ జతగా మరింత రెచ్చిపోయాడు. ఆఖర్లో షిమ్రన్ హిట్మైర్(18) ధనాధన్ ఆడడంతో రాజస్థాన్ రెండొందల మార్క్ అందుకుంది. తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో కంగుతిన్న గుజరాత్ ముందు 211 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో రెండొందల స్కోర్ మామూలైపోయింది. తొలి మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని ఉఫ్మనిపించిన రాజస్థాన్ రాయల్స్ ఈసారి 210 పరుగులతో చెలరేగింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ(31), యశస్వీ జైస్వాల్(55)లు అదిరే ఆరంభమిచ్చారు. పోటాపోటీగా బౌండరీలు బాదిన ఈ ద్వయం పవర్ ప్లేలోనే స్కోర్ 60 దాటించింది.
Dynamic Dhruv Jurel 💪
🎥 Glimpses of his terrific knock of 7⃣5⃣(42) 👏
Scorecard ▶️ https://t.co/6D02Fh0IHv#TATAIPL | #KhelBindaas | #GTvRR | @rajasthanroyals | @dhruvjurel21 pic.twitter.com/dC4f5jRT7T
— IndianPremierLeague (@IPL) April 4, 2026
ప్రమాదకరమైన వైభవ్‌ను రషీద్ ఖాన్ ఔట్ చేసి గుజరాత్‌కు తొలి బ్రేకిచ్చాడు. మూడో స్థానంలో వచ్చిన ధ్రువ్ జురెల్(75) అసలైన టీ20 ఆటతో రెచ్చిపోయాడు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి పంపిన జురెల్ అర్ధశతకంతో చెలరేగగా.. ఆఖర్లో హిట్మైర్(18 నాటౌట్) మెరుపులతో రాజస్థాన్ స్కోర్ 200 దాటింది. సిరాజ్ వేసిన చివరి ఓవర్ చివరి బంతిని రవీంద్ర జడేజా(7 నాటౌట్) ఫోర్‌గా మలిచాడు. దాంతో, నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి రాజస్థాన్ 210 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

