లక్నో: ఇంటి లోపల పార్క్ చేసిన థార్ వాహనం ఉన్నట్టుండి వేగంగా వెనక్కి వచ్చింది. ఆ కుటుంబానికి చెందిన వృద్ధురాలిని ఢీకొట్టింది. ఎదురుగా ఉన్న గోడ, థార్ మధ్య నలిగి ఆమె మరణించింది. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Old woman Crushed To Death) ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో ఈ సంఘటన జరిగింది.77 ఏళ్ల సర్లా కటియార్, ఆవాస్ వికాస్ కాలనీలో నివసిస్తున్నది. ఆరోగ్య శాఖలో రిటైర్డ్ ఉద్యోగిని అయిన ఆమె గురువారం రాత్రి 8:30 గంటల సమయంలో వాకింగ్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చింది.
కాగా, అదే సమయంలో వృద్ధురాలి బంధువుల కుటుంబానికి చెందిన వ్యక్తి ఆ ఇంటి లోపలకు థార్ వాహనం నడిపాడు. పార్క్ చేసే సమయంలో ఆ వాహనంపై అదుపు కోల్పోయాడు. దీంతో థార్ వాహనం వేగంగా వెనక్కి వచ్చింది. రోడ్డుపై ఉన్న వృద్ధురాలిని ఢీకొట్టింది. వెనుక ఉన్న గోడ, ఆ వాహనం మధ్య నలిగి ఆమె మరణించింది. అయితే ఈ సంఘటనపై వృద్ధురాలి కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పొరుగువారు ఆరోపించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
⚠️ ट्रिगर वार्निंग:
इस दुखद हादसे में बुजुर्ग महिला की मौत
हो गई है..!लेकिन सवाल ये कि थार के बैक होने का कारण क्या रहा होगा और गाड़ी के अंदर कोई था कि नहीं…?
मामला फर्रुखाबाद जनपद का है। pic.twitter.com/RNVU5TOzYV
— Rahul Saini (@JtrahulSaini) April 4, 2026