KCR | సామాజిక న్యాయం కోసం బాబు జగ్జీవన్ రామ్ పోరాడారు..!
KCR : స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జాతికి వారు అందించిన సేవలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) స్మరించుకున్నారు.
KCR : స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జాతికి వారు అందించిన సేవలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) స్మరించుకున్నారు. సామాజిక న్యాయం కోసం, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా బాబు జగ్జీవన్ రామ్ పోరాటం చేశారని గులాబీ అధినేత తెలిపారు. రక్షణ, వ్యవసాయ, కార్మిక శాఖ వంటి శాఖలకు కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలను నిర్వర్తించి, స్వాతంత్రం అనంతర స్వయంపాలనలో దేశ ప్రగతికోసం ఆయన తన వంతు కృషి చేశారని కేసీఆర్ వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో దళిత కులాలకు సామాజిక న్యాయం అమలు దిశగా గొప్ప కృషి సాగిందని కేసీఆర్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి వంటి పదవులతో నాటి ప్రభుత్వంలో ఎస్సీ (మాదిగ) కుల నాయకత్వానికి ప్రాధాన్యతనిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గులాబీ బాస్ గుర్తు చేశారు.
దళితుల సాధికారత కోసం దళిత బంధు వంటి విప్లవాత్మక పథకాన్ని అమలుచేయడంలో బాబూ జగ్జీవన్ రామ్ ఆలోచనల స్ఫూర్తి ఇమిడి ఉన్నదని కేసీఆర్ పేర్కొన్నారు. దళిత, బహుజన కులాలకు రాజకీయ, ఆర్థిక, తదితర రంగాల్లో సామాజిక న్యాయం దక్కినప్పుడే బాబూ జగ్జీవన్ రామ్‌కు మనం ఘన నివాళి అర్పించినట్టు లెక్క అని కేసీఆర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లిలో పంతుళ్ల కొరత.. ఇంట్లో పూజలకూ దొరకని పురోహితులు!
YS Sharmila | వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. కేసరపల్లి నివాసంలో నిర్బంధం..!
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

