నల్లబెల్లి, ఆగస్టు 10 : తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సంస్మరణ సభ ప్రజాదరణకు నిదర్శనంగా నిలిచింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వేలాది మంది హాజరై కన్నీటితో నివాళులర్పించారు. పెద్ద ఎత్తున పార్టీ నేతలు, అభిమానులు తరలివచ్చి ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాలుగు కౌంటర్ల ద్వారా భోజన వసతి ఏర్పాటు చేశారు.
పెద్ది సంస్మరణ సభకు విచ్చేసిన అన్ని వర్గాల ప్రజలు, నాయకులకు బీఆర్ఎస్ పార్టీ కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో శాసన మండలి విపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎంపీలు బోయిన పల్లి వినోద్‌కుమార్, మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, వొడితల సతీశ్, నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, శంకర్‌నాయక్, పార్టీ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, భరత్‌కుమార్‌రెడ్డి, నాగుర్ల వెంకన్న, మర్రి యాదవరెడ్డి, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, వరంగల్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ గండ్ర జ్యోతి, స్థానిక పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి,
ప్యాక్స్ మాజీ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్‌రావు, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ ఊడుగుల సునీత, పాలెపు రాజేశ్వర్‌రావు, తాడెబోయిన విజయ్, బత్తిని శ్రీనివాస్‌గౌడ్, నల్ల మనోహర్‌రెడ్డి, రాయిడి రవీందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి తక్కళ్లపల్లి రవీందర్రావు, సుకునే రాజేశ్వర్ రావు, కొమ్ము రమేశ్‌యాదవ్, గటికె అజయ్‌కుమార్, గోనె యువరాజ్, సూరయ్య, ఎన్ఆర్ఐ రాజ్‌కుమార్, జక్క అశోక్, బాల్నె వెంకన్న, నబీసాబ్, రామస్వామీనాయక్, దార్ల రమాదేవి, పిన్నా భాస్కర్, రాయిడి కీర్తి, ఎన్ రాజారాం తదితరులు హాజరయ్యారు.