సర్ డిజిటైజేషన్లో సిటీ లాస్ట్
ప్రత్యేక ఓటరు సవరణ జాబితా ప్రక్రియలో ఎన్యూమరేషన్ గడువు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రక్రియలో హైదరాబాద్ చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ శతశాతం పూర్తి చేసిన డిజిటైజేషన్ మాత్రం 60 శాతానికి కూడా చేరుకోలేకపోయింది. సోమవారం గడువు ముగిసేసరికి డిజిటైజేషన్ కేవలం 58.9 శాతం మాత్రమే పూర్తయింది.
- 59 శాతంతో రాష్ట్రంలోనే అత్యల్పం
సిటీ బ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక ఓటరు సవరణ జాబితా ప్రక్రియలో ఎన్యూమరేషన్ గడువు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రక్రియలో హైదరాబాద్ చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ శతశాతం పూర్తి చేసిన డిజిటైజేషన్ మాత్రం 60 శాతానికి కూడా చేరుకోలేకపోయింది. సోమవారం గడువు ముగిసేసరికి డిజిటైజేషన్ కేవలం 58.9 శాతం మాత్రమే పూర్తయింది.
గ్రామీణ జిల్లాలో డిజిటలీకరణ 80 శాతం నుంచి 90 శాతానికి పైగా పూర్తయింది. హైదరాబాద్ జిల్లాలో ఓటర్లు ఓటు నమోదు చేసుకోవడంలోనూ వెనుకంజలోనే ఉన్నారు. ఎన్నికల కమిషన్ అధికారులు గడువును రెండు సార్లు పొడిగించినా ఓటర్లు తమ ఓటును నమోదు చేసుకోవడానికి ఆసక్తి చూపలేదు. దీన్ని బట్టి 40 శాతం ఓటర్లు తమ ఓటును సొంతూళ్లలోనే నమోదు చేసుకున్నట్లు తేటతెల్లమవుతున్నది. బీఎల్వోలు మొదటి నుంచి ఓటర్లు ఇండ్లకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయలేదు. పోలింగ్ కేంద్రాలకే ఓటర్లను పిలిపించుకుని పంపి ణీ చేశారు. సమాచారం లేనివాళ్లు ఫారాలే తీసుకోలేదు.
బహదూర్‌పురా టాప్.. ముషీరాబాద్ లీస్ట్..
నగర వ్యాప్తంగా ఇతర జిల్లాల నుంచి వచ్చి స్థిరపడ్డవాళ్లు దాదాపుగా తమ సొంతూళ్లలోనే ఓటు నమోదు చేసుకునేందుకు మొగ్గుచూపారు. నగరంలోని 41 శాతానికి పైగా ఓటర్లు తమ స్వగ్రామాల్లోనే ఓటు నమోదు చేసుకున్నట్లు స్పష్టమవుతున్నది. ఊళ్లో ఓటు హక్కు ఉంటేనే గౌరవ మర్యాదలు ఉంటాయని భావించినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆయా నియోజకవర్గాల్లో సగం కంటే ఎక్కువ డిజిటైజేషన్ జరగలేదు.
సిటీలో నియోజకవర్గాల వారి డిజిటైజేషన్ 65 శాతానికి దాటలేదు. ముఖ్యంగా ఎంఐఎం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో 60 శాతానికి పైగా డిజిటలీకరణ పూర్తయింది. అత్యధికంగా బహదూర్‌పురలో 65 శాతం డిజిటలీకరణ పూర్తయింది. అత్యల్పంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో 54 శాతానికి పరిమితమైంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

