5 లక్షల పొదుపు చెదలపాలు
రాజస్థాన్‌కు చెందిన ఒక రైతు తన దగ్గరున్న ఐదు లక్షల రూపాయల పొదుపు సొమ్ము దొంగల బారిన పడకుండా కాపాడుకునేందుకు తన పొలంలో పాతిపెట్టి దాచుకున్నాడు. ఏడాది క్రితం అతనికి చెందిన భూమిని విక్రయించగా వచ్చిన ఐదు లక్షల రూపాయలతో ఇంటిని నిర్మించుకోవాలనుకున్నాడు.
- రాజస్థాన్ రైతుకు చేదు అనుభవం
జైపూర్: రాజస్థాన్‌కు చెందిన ఒక రైతు తన దగ్గరున్న ఐదు లక్షల రూపాయల పొదుపు సొమ్ము దొంగల బారిన పడకుండా కాపాడుకునేందుకు తన పొలంలో పాతిపెట్టి దాచుకున్నాడు. ఏడాది క్రితం అతనికి చెందిన భూమిని విక్రయించగా వచ్చిన ఐదు లక్షల రూపాయలతో ఇంటిని నిర్మించుకోవాలనుకున్నాడు. అయితే ఆ నగదు చోరీ అవుతుందనే భయంతో ఒక పాలిథన్ కవర్లో పెట్టి, తన పొలంలో గుంత తవ్వి దానిలో దాచిపెట్టాడు. అయితే అతనికున్న మద్యం అలవాటు, మతిమరపు కారణంగా డబ్బు ఎక్కడ దాచిపెట్టాడో మరచిపోయాడు. అయినప్పటికీ చాలా చోట్ల తవ్వి చూశాడు. డబ్బు దొరకకపోవడంతో భార్యకు, కుమారులకు విషయం చెప్పాడు. దీంతో వారంతా ఆ నగదు కోసం పొలంలో పలు చోట్ల తవ్వారు. అయినా ఫలితం లేకపోయింది.
ఏడాది తర్వాత వర్షాకాలంలో విత్తనాలు విత్తేందుకు ఆ కుటుంబ సభ్యులు పొలాన్ని చదును చేస్తుండగా, వారికి నగదు ఉన్న పాలిథిన్ కవర్ దొరికింది. దానిని తెరచి చూసి నివ్వెరపోయారు. ఏడాది క్రితం ఇంటిపెద్ద దాచిన డబ్బు అదేనని గుర్తించారు. అయితే ఆ డబ్బును అప్పటికే చెద పురుగులు నాశనం చేశాయి. మిగిలిన్న కొన్ని నోట్ల ముక్కలనైనా కాపాడుకునేందుకు వారు పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా(ఎస్బీఐ) బ్రాంచిని సంప్రదించారు. అయితే ఆ నోట్ల పరిస్థితి చూసిన బ్యాంకు సిబ్బంది వాటిని తీసుకునేందుకు నిరాకరించారు. తరువాత వారు జిల్లా ఎస్బీఐ ప్రధాన శాఖకు వెళ్లినా అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

