లక్నో: రెండో భార్య కావాలంటూ ఒక వ్యక్తి నిరసన తెలిపాడు. ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి హంగామా చేశాడు. తనకు రెండో పెళ్లి చేయకపోతే చనిపోతానని బెదిరించాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తికి నచ్చజెప్పి కిందకు దించారు. (Man Climbs Water Tank For Second Wife) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జనవరి 1న ఇస్లాంనగర్‌కు చెందిన హర ప్రసాద్ మౌర్య వినూత్నంగా నిరసన తెలిపాడు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న 30 అడుగుల ఎత్తైన వాటర్ ట్యాంకుపైకి ఎక్కాడు. తనకు రెండో భార్య కావాలని డిమాండ్ చేశాడు.
కాగా, ఇది చూసి స్థానికులు షాక్ అయ్యారు. ఆసుపత్రి వద్ద గందరగోళం నెలకొనడంతో పోలీసులకు డాక్టర్ సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. హర ప్రసాద్‌తో మాట్లాడారు. ‘సార్, నేను పది రోజులుగా అదే మురికి బట్టలు వేసుకుంటున్నా. ఎవరు ఉతుకుతారు? అందరికీ భార్యలు ఉన్నారు. నాకు కూడా ఒక భార్య కావాలి. నా మొదటి భార్య నన్ను విడిచిపెట్టింది. మీరు నాకు రెండవ భార్యను ఇవ్వకపోతే, నేను చనిపోతా’ అని అరిచాడు.
మరోవైపు పోలీసులు సుమారు 30 నిమిషాల పాటు హర ప్రసాద్‌కు నచ్చజెప్పారు. చివరకు అతడిని కిందకు దించారు. అయితే తమ కుమారుడు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని అతడి తల్లిదండ్రులు తెలిపారు. ఎనిమిదేళ్ల కిందట పెళ్లి కాగా భార్య విడిచి వెళ్లిపోయిందని చెప్పారు. ఆరేళ్ల కుమారుడు అతడితోపాటు ఉంటున్నట్లు వివరించారు.
కాగా, పోలీసులు హర ప్రసాద్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు అతడిని అప్పగించారు. మరోసారి ఇలా జరుగకుండా చూడాలని వారికి సూచించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
साहब, मैं दस दिन से यही गंदे कपड़े पहने हूं, कौन धुलेगा? सबकी पत्नियां हैं, तो मुझे भी चाहिए…!
पहली पत्नी मुझे छोड़कर जा चुकी है..दूसरी बीबी दिलाओं नहीं तो जान दे दूंगा..!
यूपी के बदायूं में दुल्हन की चाह में हर प्रसाद मौर्य 30 फीट ऊंची पानी की टंकी पर चढ़ गया..!
आधे घंटे तक… pic.twitter.com/KuKt6XPapZ— Rahul Saini (@JtrahulSaini) January 3, 2026
Also Read:
Leopard Attacks Farmer | రైతుపై చిరుత దాడి.. బావిలో పడి ఇద్దరూ మృతి
IED blasts rock Manipur | పేలుళ్లతో దద్దరిల్లిన మణిపూర్.. ఇద్దరికి గాయాలు