Dhurandhar The Revenge Trailer | రేపే ‘ధురంధర్ 2’ ట్రైలర్.. మార్చి 19న థియేటర్లలోకి భారీ యాక్షన్ థ్రిల్లర్
Dhurandhar The Revenge | బాలీవుడ్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది.
Dhurandhar The Revenge | బాలీవుడ్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం (మార్చి 7) ఉదయం 11:01 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది (2025) బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా మరియు అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, సారా అర్జున్ కీలక పాత్ర పోషిస్తోంది.
‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ మరియు టి-సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టీజర్ ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచేశాయి. ఈ మోస్ట్ ఎవైటెడ్ ‘రివెంజ్’ డ్రామా మార్చి 19, 2026న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. రేపు విడుదల కానున్న ట్రైలర్ ఈ యాక్షన్ విందును ఏ స్థాయిలో చూపించబోతుందోనని అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Brace yourself ⚔️
Trailer out tomorrow 7th March at 11:01 AM#DhurandharTheRevenge Releasing In Cinemas Worldwide on 19th March 2026 in Hindi, Telugu, Tamil, Kannada & Malayalam@rampalarjun @duttsanjay @ActorMadhavan #AkshayeKhanna #SaraArjun @bolbedibol @AdityaDharFilms… pic.twitter.com/RECbmOcODQ
— Ranveer Singh (@RanveerOfficial) March 6, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

