Hyderabad | హైదరాబాద్లో హిట్ అండ్ రన్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 2వ తేదీన గాంధీనగర్ పీఎస్ పరిధిలో స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తిని నిలోఫర్ ఆస్పత్రి మహిళా డాక్టర్ కారుతో ఢీకొట్టి పరారయ్యింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కృష్ణ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ ప్రమాదంపై బాధిత కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను అరెస్టు చేసి, ప్రమాదానికి గురైన కారును సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సీసీటీవీ ఫుటేజ్
హైదరాబాద్ నగరంలో హిట్ అండ్ రన్ ఘటన
స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని కారుతో ఢీకొట్టి పరారైన నిలోఫర్ ఆసుపత్రి మహిళా డాక్టర్
హైదరాబాద్ – గత నెల 2వ తేదీన గాంధీ నగర్ పరిధిలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద స్కూటీపై వెళ్తున్న బీరం కృష్ణ అనే వ్యక్తిని కారు(TS08HL4682)తో… pic.twitter.com/KNp9c8exVb
— Telugu Scribe (@TeluguScribe) March 6, 2026