Virosh | టాలీవుడ్లో ఇన్నాళ్లు ప్రేమజంటగా వార్తల్లో నిలిచిన విజయ్ దేవరకొండ-రష్మిక తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి అనంతరం విజయ్ స్వగ్రామంలో సాంప్రదాయంగా సత్యనారాయణ వ్రతం నిర్వహించగా, తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీంతో దాదాపు పది రోజుల పాటు ఈ జంట పెళ్లి వేడుకలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇదిలా ఉండగా, పెళ్లి తర్వాత రష్మికకు అత్తారింటి నుంచి అందిన తొలి కానుకలపై తాజాగా కొత్త చర్చ మొదలైంది. విజయ్ దేవరకొండ తల్లి మాధవి తమ కుటుంబంలో తరతరాలుగా వస్తున్న వారసత్వ గాజులను కోడలు రష్మికకు బహుమతిగా ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. ఆ సెంటిమెంట్ గిఫ్ట్ ఇప్పటికే అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్య రష్మికకు విజయ్ దేవరకొండ వ్యక్తిగతంగా ఖరీదైన పెళ్లి కానుక ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో సకల సౌకర్యాలతో నిర్మించిన ఓ లగ్జరీ విల్లాను రష్మికకు గిఫ్ట్‌గా ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. ఈ విల్లా విలువ సుమారు రూ.90 కోట్ల వరకు ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పెళ్లి తర్వాత భార్యకు ఇచ్చే తొలి కానుక ప్రత్యేకంగా ఉండాలని భావించి విజయ్ ఇలా భారీ గిఫ్ట్ ప్లాన్ చేశారని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ విషయం నెట్టింట విస్తృతంగా చర్చకు దారి తీస్తోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఈ జంట ప్రేమకథ కూడా అభిమానులకు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.గీతా గోవిందం సినిమా షూటింగ్ సమయంలో మొదటిసారి కలిసిన విజయ్–రష్మిక మధ్య స్నేహం మొదలై, ఆ తర్వాత అది ప్రేమగా మారింది. తరువాత డియర్ కామ్రేడ్ సమయంలో వారి బంధం మరింత బలపడిందని చెబుతారు. ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్లో విజయ్ దేవరకొండ తమ ప్రేమ కథ గురించి ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. మొదటగా రష్మికే తనకు ప్రపోజ్ చేసిందని ఆయన చెప్పడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన ఈ జంట చివరికి వివాహ బంధంతో ఒక్కటైంది. మొత్తానికి, విరోష్ జంట పెళ్లి వేడుకలతో పాటు ఇప్పుడు ఈ ఖరీదైన కానుక వార్త కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే నిజంగా ఆ రూ.90 కోట్ల విల్లా గిఫ్ట్ విషయమేమిటో తెలియాలంటే అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.