flight disruptions | ఒకే రోజు మూడు విమాన సర్వీసులకు అంతరాయం.. ప్రయాణికుల ఆగ్రహం
flight disruptions | ఒకే రోజు మూడు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయా విమానయాన సంస్థల సేవలపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: ఒకే రోజు మూడు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయా విమానయాన సంస్థల సేవలపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. (flight disruptions) బుధవారం ఉదయం కోల్‌కతా- చెన్నై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానం టేకాఫ్ ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆగ్రహించారు. కోల్‌కతా విమానాశ్రయంలో నిరసన చేపట్టారు.
కాగా, ఢిల్లీ- పూణే స్పైస్‌జెట్ విమానం మంగళవారం రాత్రి 9.55 గంటలకు టేకాఫ్ కావల్సి ఉన్నది. ప్రయాణికులు విమానం ఎక్కిన తర్వాత సాంకేతిక సమస్య ఎదురైంది. ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ పనిచేయకపోవడంతో విమానం లోపల వేడి వల్ల ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఉక్కపోతతో అల్లాడిపోయారు. పిల్లలు ఏడ్వగా, గర్భిణీలు మరింత ఇబ్బందిపడ్డారు. చేతితో విసురుకుని గాలి పొందేందుకు కొందరు ప్రయత్నించారు. ప్రయాణికుల నిరసనతో సాంకేతిక బృందం ఆ విమానాన్ని పరిశీలించింది. ఆ విమాన సర్వీసును రద్దు చేయడంతో ప్రయాణికులు టెర్మినల్‌లోకి చేరుకున్నారు. చివరకు బుధవారం ఉదయం 5 గంటలకు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేశారు.
మరోవైపు మంగళవారం రాత్రి 11.30 గంటలకు కోల్‌కతా-చెన్నై ఇండిగో విమానం ఎడమ ఇంజన్ పనిచేయకపోవడంతో చెన్నై విమానాశ్రయంలో పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 224 మంది ప్రయాణికులు ఉన్న ఆ విమానం ల్యాండింగ్ కోసం అత్యవసర ప్రతిస్పందన ఏర్పాట్లు చేశారు. రాత్రి 11.37 గంటలకు అది సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊరట చెందారు. అనంతరం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర పరిస్థితిని ఉపసంహరించడంతో విమాన కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయి.
हे दिल्लीहून पुण्याला जाणारे स्पाइसजेटचे विमान होते. विमानामध्ये आबालवृद्धांसह लहान मुलं देखील होती. या विमानात बसल्यानंतर विमानातील तापमान अचानक प्रचंड वाढलं. तापमान एवढं वाढत गेलं की लोकांना सहन होईना. सगळे घामाने ओले झाले होते. लोकांना श्वास घ्यायला खूप जास्त त्रास व्हायला… pic.twitter.com/jVYTEMcFNv
— Leshpal_speaks (@Leshpal_speaks) August 11, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

