Ravi Teja’s Irumudi Trailer | మాస్ మహారాజా రవితేజ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఇరుముడి’ ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎస్.ఆర్.కె.ఆర్. ఇంజనీరింగ్ కాలేజీలో అత్యంత భారీ స్థాయిలో నిర్వహించిన ప్రత్యేక లాంచ్ ఈవెంట్లో చిత్ర యూనిట్ ఈ ట్రైలర్ను విడుదల చేసింది.
ట్రైలర్ ఆద్యంతం సినిమాపై భారీ అంచనాలను పెంచేలా ఉంది. రవితేజను ఇప్పటివరకు ఎన్నడూ చూడని సరికొత్త డిఫరెంట్ వేరియేషన్లో ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఒకవైపు అదిరిపోయే మాస్ యాక్షన్ ఎలిమెంట్స్, మరోవైపు తండ్రీకూతుళ్ల మధ్య ఉండే హృదయానికి హత్తుకునే ఎమోషనల్ బాండింగ్, అలాగే కథకు తగ్గట్టుగా జోడించిన డివైన్ టచ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు అద్భుతమైన బాణీలు అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్ మరియు టీ-సిరీస్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 21న గ్రాండ్గా థియేటర్లలో విడుదల కానుంది.