Viral Video | జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. సర్పంచ్ కారుకు దారి ఇవ్వలేదని దళితుడిని కులం పేరుతో దూషిస్తూ చితకబాదిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామానికి చెందిన తిరుపతి అనే దళితుడిపై కాంగ్రెస్ సర్పంచ్ శారద భర్త గంగారాం, మరో ముగ్గురు దాడి చేశారని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. కారుకు దారి ఇవ్వలేదనే కారణంతోనే అతడిని కులం పేరుతో దూషిస్తూ, ఈడ్చిపారేశారని తెలిపారు. అతనిపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కాగా, దళితుడిపై సర్పంచ్ భర్త, కాంగ్రెస్ నాయకులు చితకబాదిన దృశ్యాలు అక్కడి పరిసరాల్లోని సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ ఫుటేజీ ఇప్పుడు బయటకొచ్చింది. ఆ వీడియోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. ఈ వీడియో అధారంగా పోలీసులు బాధితునికి న్యాయం చేస్తారో లేదో చూడాలి. డబ్బు, అధికారానికి పోలీసులు భయపడి తళితునికి న్యాయం చేస్తారా? అన్న అనుమానం స్థానికుల్లో ఉంది.
కారుకు దారి ఇవ్వలేదని వ్యక్తిని కులం పేరుతో దూషిస్తూ చితకబాదిన కాంగ్రెస్ సర్పంచ్ భర్త
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపుర్ గ్రామంలో దారుణం
కారుకు దారి ఇవ్వలేదని తిరుపతి అనే దళిత వ్యక్తిపై దాడి చేసి, ఈడ్చి పారేసిన కాంగ్రెస్ సర్పంచ్ శారద భర్త గంగారాం, మరో ముగ్గురు
కులం… pic.twitter.com/6M0IBBTHhb
— Telugu Scribe (@TeluguScribe) March 6, 2026