ముంబై: టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ఇండియా ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. పరుగుల ప్రవాహం సృష్టించిన ఆ మ్యాచ్‌లో ఇండియా ఏడు పరుగుల తేడాతో నెగ్గింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా ఏడు వికెట్ల నష్టానికి 253 రన్స్ చేసింది. అయితే బ్యాటర్ సంజూ శాంసన్(Sanju Samson) కేవలం 42 బంతుల్లో 89 రన్స్ చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వాంఖడే స్టేడియంలో బౌండరీల మోత మోగించాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆఖరి వరకు పోరాడింది. ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 246 రన్స్ చేసి ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లండ్ బ్యాటర్ బేథెల్ సూపర్ సెంచరీ కొట్టాడు. 48 బంతుల్లో 8 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 105 రన్స్ చేసి ఔటయ్యాడు.
అయితే భారత్ ఇన్నింగ్స్‌లో అత్యధిక రన్స్ చేసిన సంజూ శాంసన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఆ అవార్డు అందుకున్న తర్వాత సంజూ మాట్లాడుతూ.. ఈ అవార్డు తనకు దక్కాల్సింది కాదన్నారు. భారత జట్టు విజయంలో బౌలర్ బుమ్రా కీలక పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు. గెలుపు క్రెడిట్ బుమ్రాకే దక్కుతుందని, అతనో ప్రపంచ మేటి బౌలర్ అని, తరానికి ఓసారి అలాంటి ఆటగాడు దొరుకుతారని, సెమీస్ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడని, ఈ అవార్డు వాస్తవానికి ఆయనకే దక్కాలని అన్నారు.
డెత్ ఓవర్లలో బుమ్రా వేసిన బౌలింగ్ తీరు ప్రత్యేకమైందని, ఒకవేళ అలా బౌలింగ్ చేయకుంటే, బహుశా తాను ఇక్కడ నిలబడేవాడిని కాదన్నారు. ఈ విజయంలో బౌలర్లకే క్రెడిట్ దక్కుతుందన్నారు. కఠినమైన పరిస్థితుల్లో ఉత్తమంగా రాణించారన్నారు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో బుమ్రా యార్కర్లతో ఇంగ్లండ్ బ్యాటర్లను అడ్డుకున్నాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి తక్కువ పరుగులు ఇచ్చాడు. ఇండియా విక్టరీలో ఆ ఓవర్ అత్యంత కీలకంగా మారింది.
The knock that powered us into the #Final 👏
Sanju Samson gets his 2nd consecutive Player of the Match award for a match-winning 89 (42) 🫡
Scorecard ▶️ https://t.co/LxSBs3EDPx#TeamIndia | #T20WorldCup | #MenInBlue | #ENGvIND pic.twitter.com/s5ojGuL2Pw
— BCCI (@BCCI) March 5, 2026