న్యూఢిల్లీ: చరిత్రాత్మక ఘటన చోటుచేసుకున్నది. వందేమాతరం(Vande Mataram) గేయాన్ని ఎర్రకోట వద్ద ఆలపించారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇవాళ పూర్తి స్థాయిలో ఆ గీతాన్ని పాడారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆ గేయాన్ని పాడడం ఇదే మొదటిసారి. వందేమాతరం గీతాన్ని రాసి 150 ఏళ్లు పూర్తి అవుతోంది. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఈ గేయం కీలక పాత్ర పోషించింది. దేశ ప్రజల్లో ఆ పాట జాగృతి నింపింది. ప్రధాని మోదీ జాతీయ పతాకాన్ని ఎగురవేసిన తర్వాత ఎర్రకోటపై వందేమాతర గీతం ప్రతిధ్వనించింది. తొలుత 21 గన్ సెల్యూట్ చేశారు. 1721 ఫీల్డ్ బ్యాటరీ సెర్మోనియల్ గ్రూపు ఈ సెల్యూట్ నిర్వహించారు. 105 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్స్ వాడారు. ఆర్మీ బ్యాండ్ ద్వారా వందేమాతరాన్ని ఆలపించారు. ఎర్రకోట వేదికపై రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. ఓ హెలికాప్టర్ జాతీయ పతాకాన్ని మోసుకెళ్లింది. మరో హెలికాప్టర్ వందేమాతరం గీతం రాసిన జెండాను తీసుకెళ్లింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి వందేమాతరం గీతాన్ని ఎర్రకోట వద్ద ఆలపించారు.
The Red Fort witnesses a first that will be remembered.
As India celebrates 80 years of Independence, #VandeMataram resonates from its historic ramparts for the first time. A moment when the spirit of the freedom struggle meets the pride of a New India.#IndiaIndependenceDay pic.twitter.com/9MLKKaQbpv
— MyGovIndia (@mygovindia) August 15, 2026