Bengalore | మంత్రి వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం.. బెంగళూరులోనే నిలిపివేత..!
Bengalore | బెంగళూరు (Bengalore) నుంచి విజయవాడ (Vijayawada) కు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం (Air India Express Flight) లో బుధవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి (AP Minister) మండపల్లి రామప్రసాద్ రెడ్డి (Mandapally Ram Prasad Reddy) తోపాటు పలువురు ప్రముఖులు ప్రయాణిస్తున్నారు.
Bengalore : బెంగళూరు (Bengalore) నుంచి విజయవాడ (Vijayawada) కు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం (Air India Express Flight) లో బుధవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి (AP Minister) మండపల్లి రామప్రసాద్ రెడ్డి (Mandapally Ram Prasad Reddy) తోపాటు పలువురు ప్రముఖులు ప్రయాణిస్తున్నారు. టేకాఫ్ (Take Off) కు సిద్ధమైన కొద్దిసేపటికే సాంకేతిక సమస్యను గుర్తించడంతో విమానాన్ని తిరిగి బే వద్దకు తీసుకువచ్చారు.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం IX2875 విజయవాడకు బయలుదేరాల్సి ఉంది. వెలగపూడి సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యేందుకు మంత్రి రామప్రసాద్ రెడ్డి ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. అయితే విమానం టేకాఫ్కు సిద్ధమవుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు సిబ్బంది గుర్తించారు. దాంతో వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని రన్వే పైనుంచి వెనక్కి మళ్లించి బే వద్దకు తరలించారు.
విమానం తిరిగి ఎప్పుడు బయలుదేరుతుందనే అంశంపై ఎయిర్లైన్స్ సిబ్బంది నుంచి స్పష్టమైన సమాచారం లభించడం లేదని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారని, అంతవరకు వేచి ఉండాలని సిబ్బంది సూచించినట్లు సమాచారం. ఈ పరిణామంతో మంత్రి రామప్రసాద్ రెడ్డి ప్రయాణానికి అంతరాయం కలుగగా మిగిలిన ప్రయాణికులు కూడా విమానాశ్రయంలో నిరీక్షించాల్సి వస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

