Jamie Dimon | భారత్‌పై ఆంక్షలతో ప్రపంచ మార్కెట్లకు తీవ్ర నష్టం.. అమెరికాకు జేపీ మోర్గాన్ సీఈఓ హెచ్చరిక..!
Jamie Dimon | రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్ (India) పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని, శిక్షార్హమైన టారిఫ్‌లు (Tariffs) విధించవద్దని అమెరికా (USA) కు ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (Global Investment Bank) జేపీ మోర్గాన్ చేజ్ సీఈఓ (JPMorgan Chase CEO) జేమీ డైమన్ (Jamie Dimon) సూచించారు.
Jamie Dimon : రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్ (India) పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని, శిక్షార్హమైన టారిఫ్‌లు (Tariffs) విధించవద్దని అమెరికా (USA) కు ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (Global Investment Bank) జేపీ మోర్గాన్ చేజ్ సీఈఓ (JPMorgan Chase CEO) జేమీ డైమన్ (Jamie Dimon) సూచించారు. తొందరపడి ఏకపక్షంగా ముందుకెళ్తే అది కేవలం భారత్‌కే కాకుండా యావత్ ప్రపంచ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఈ విషయంలో పునరాలోచన చేయాలని సలహా ఇచ్చారు.
జేపీ మోర్గాన్ ఇండియా ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడారు. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న చమురుపై టారిఫ్‌లు విధించే ముందు అమెరికా ప్రభుత్వం క్షుణ్ణంగా ఆలోచించాలని అన్నారు. భారత రిఫైనరీలు రష్యా చమురును ఎలా వినియోగిస్తున్నాయో.. వాటి అవసరాలేమిటో వాషింగ్టన్ ముందుగా అర్థం చేసుకోవాలని హితవు పలికారు. భారత్‌పై ఆంక్షలు విధించే బదులు.. అమెరికా అధికారులు ఢిల్లీతో కూర్చుని అన్ని వాస్తవాలను చర్చించాలని సూచించారు.
‘రష్యాతో పోరాడేందుకు చేయాల్సినవి చేస్తూనే భారత్‌ను, ప్రపంచ చమురు మార్కెట్లను శిక్షించకుండా అమెరికా వ్యవహరిస్తుందని నేను ఆశిస్తున్నా’ అని జేమీ డైమన్ పేర్కొన్నారు. చమురుపై టారిఫ్‌లు విధించడం సరైన నిర్ణయమా.. కాదా..? అనే దానిపై తనకు పూర్తి స్పష్టత లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించేందుకు అధికారం కల్పిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ చట్టంపై సంతకం చేసిన నేపథ్యంలో డైమన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
రష్యా నుంచి అత్యధికంగా ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఈ చట్టం అమల్లోకి వస్తే భారత్‌పై ప్రభావంపడే అవకాశం ఉంది. భారత రిఫైనరీలు ప్రాసెస్ చేస్తున్న రష్యా చమురుకు ప్రత్యామ్నాయాలను అంత సులభంగా కనుగొనలేకపోవచ్చని డైమన్ గుర్తుచేశారు. సరఫరాలో ఆకస్మిక మార్పులుచేస్తే అది భారత రిఫైనరీలకే కాకుండా విస్తృత ఇంధన మార్కెట్లకు కూడా నష్టం కలిగిస్తుందని వివరించారు. అనూహ్య పరిణామాలకు దారితీసే చర్యల కంటే, వాస్తవాలపై చర్చలు జరపడం ఎంతో అవసరమని ఆయన స్పష్టంచేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | వరంగల్ అంటేనే ఒక ఉత్తేజం, ఒక ఉద్వేగం, ఉద్యమం : కేటీఆర్
AP News | అన్నాచెల్లెళ్ల మధ్య ముదురుతున్న వివాదం.. యలహంక ప్యాలెస్‌కు వైఎస్ షర్మిల..!
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Donald Trump | దేశాధ్యక్షుడినైన నాకంటే ఆమెకు బిడ్డపైనే ప్రేమ ఎక్కువ.. కరోలిన్ లీవిట్ గురించి ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
BJP MLA Rekha Patra Critical | బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్ర పరిస్థితి విషమం.. వెంటిలేటర్ సపోర్ట్‌పై చికిత్స
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

