KTR | వరంగల్ అంటేనే ఒక ఉత్తేజం, ఒక ఉద్వేగం, ఉద్యమం : కేటీఆర్
KTR | వరంగల్ అంటేనే ఒక ఉత్తేజం, ఒక ఉద్వేగం, ఉద్యమం కాతీయుల ధిక్కారానినికి, కాళోజీ పౌరుషానికి, జయశంకర్ ఆలోచనకు ప్రతీక స్ఫూర్తినిచ్చే గడ్డ వరంగల్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని అన్నారు.
KTR | వరంగల్ అంటేనే ఒక ఉత్తేజం, ఒక ఉద్వేగం, ఉద్యమం కాతీయుల ధిక్కారానినికి, కాళోజీ పౌరుషానికి, జయశంకర్ ఆలోచనకు ప్రతీక స్ఫూర్తినిచ్చే గడ్డ వరంగల్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని అన్నారు. ఆదివారం హనుమకొండ కాకతీయ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో జన చైతన్య సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేసీఆర్ పదేండ్ల పాలన చూశారు. కరోనా వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఆగలేదు. బీఆర్ఎస్ పాలనలో కరెంట్ కోతలు, నీటి సమస్యలు లేవు. ఎన్నికల్లో తప్పుడు వాగ్ధానాలు ఇవ్వలేదు. ఎలక్షన్స్‌లో కల్యాణ లక్ష్మి, రైతు బీమా, ఇంటింటికి నల్లా నీళ్లు ఇస్తానని చెప్పలేదు.
మంచి మనసుతో ఇవన్నీ చేశారు. ఓరుగల్లు పోరుగల్లు పౌరుషం కేసీఆర్ మొండి పట్టుదలో కనిపిస్తుంది. ఆనాడు రూ.200 పెన్షన్‌ను కేసీఆర్ రూ.2000 పెంచాడని గుర్తు చేశారు. పేదింటి ఆడబిడ్డకు మేనమామలా మారి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అందజేశారు. పేద వారికి ఇండ్ల పట్టాలు ఇచ్చి ఆదుకున్నాం. కానీ, కాంగ్రెస్‌కు ఇది కడుపు మండి మాయమాటలు చెప్పి 420 మామీలు ఇచ్చి ఇద్దరు పదురుకొని కేసీఆర్ ని ఓడించారు. రేవంత్ రెడ్డి నిజాయితీపరుడైన మోసగాడు. ఎనకటి రోజులు వస్తయని చెప్పాడు. అన్నట్లుగా నీళ్లు, కరెంట్ లేదు, విత్తనాలు, పెన్షన్స్ లేవు ఇలా అన్ని రకాలుగా రేవంత్ రెడ్డి మోసం చేశాడన్నారు.
రేవంత్ రెడ్డి మహిళలను కోటీశ్వరులను చేస్తానని ప్రగల్బాలు పలుకుతున్నాడు. నీకు దమ్ముంటే వారిని లక్షాదికారి చేయాలని సవాల్ విసిరారు. అంతకు ముందు కేటీఆర్ ఏకశిలా విద్యాసంస్థల అధినేత గౌరు తిరుపతిరెడ్డి, పలువురు మాజీ కార్పొరేటర్లు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | వరంగల్ అంటేనే ఒక ఉత్తేజం, ఒక ఉద్వేగం, ఉద్యమం : కేటీఆర్
AP News | అన్నాచెల్లెళ్ల మధ్య ముదురుతున్న వివాదం.. యలహంక ప్యాలెస్‌కు వైఎస్ షర్మిల..!
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Donald Trump | దేశాధ్యక్షుడినైన నాకంటే ఆమెకు బిడ్డపైనే ప్రేమ ఎక్కువ.. కరోలిన్ లీవిట్ గురించి ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
BJP MLA Rekha Patra Critical | బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్ర పరిస్థితి విషమం.. వెంటిలేటర్ సపోర్ట్‌పై చికిత్స
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

