రాంచీ: ఒక వ్యక్తి యూపీఎస్సీ పరీక్షలో నాలుగు సార్లు ఫెయిల్ అయ్యాడు. అయితే గత ఏడేళ్లుగా టాప్ ఐఏఎస్ ఆఫీసర్‌గా చెలామణి అవుతున్నాడు. (Man Poses As Top Civil Servant) ఒక భూ వివాదంపై పోలీస్ అధికారిని అతడు కలిశాడు. దీంతో ఆ వ్యక్తి గుట్టురట్టయ్యింది. జార్ఖండ్ రాజధాని రాంచీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కుఖి ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల రాజేష్ కుమార్ జనవరి 2న భూ వివాదం విషయం పై హుస్సేనాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను అతడు కలిశాడు. 2014 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ప్రస్తుతం భువనేశ్వర్‌లో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ (సీఏవో)గా ఉన్నట్లు తెలిపాడు.
కాగా, గతంలో డెహ్రాడూన్, హైదరాబాద్, భువనేశ్వర్‌తో సహా వివిధ రాష్ట్రాల్లో పలు హోదాల్లో పని చేసినట్లు రాజేష్ కుమార్ చెప్పాడు. ఇండియన్ పోస్ట్ అండ్ టెలికమ్యూనికేషన్స్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్ (ఐప్టాస్) అధికారినంటూ పోలీస్ అధికారిని నమ్మించాడు. ‘భారత ప్రభుత్వం’ నేమ్‌ప్లేట్‌తో కూడిన వాహనాన్ని అతడు వినియోగిస్తున్నాడు.
మరోవైపు రాజేష్ కుమార్‌పై ఆ పోలీస్ అధికారికి అనుమానం కలిగింది. దీంతో దర్యాప్తు చేశారు. అతడు ఐఏఎస్ అధికారి కాదని, ఏ ప్రభుత్వ రంగ సంస్థలో పని చేయలేదని పోలీసులు తెలుసుకున్నారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
అయితే యూపీఎస్సీ పరీక్షకు నాలుగుసార్లు హాజరై ఫెయిల్ అయ్యానని రాజేష్ కుమార్ తెలిపాడు. తన తండ్రి కోరిక నెరవేర్చడానికి గత ఏడేళ్లుగా టాప్ ఐఏఎస్ అధికారిగా నటిస్తున్నట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Watch: హైవే డివైడర్‌పై థార్‌తో డేంజరస్ స్టంట్లు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రెండో భార్య కావాలంటూ.. వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి వ్యక్తి నిరసన, తర్వాత ఏం జరిగిందంటే?
Watch: పాముతో వ్యక్తి సంభాషణ.. వీడియో వైరల్