‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంతో ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇటీవలే ఈ సినిమా 50రోజుల్ని పూర్తి చేసుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో చిరంజీవి తదుపరి సినిమా ఎప్పుడు సెట్స్‌మీదకు వెళ్తుందోనని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే.
మెగాస్టార్ 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కించనున్నారు. ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్తుందని భావించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 14 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రియమణి, అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో కీలక పాత్రల్ని పోషించనున్నారు. ఈ చిత్రానికి ‘కాకా’ అనే టైటిల్‌ను ఖరారు
చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.