డెహ్రాడూన్: హిందువులు కాని వ్యక్తులపై ఆంక్షలు విధించాలని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నాయకురాలు డిమాండ్ చేశారు. హిందువుల కాని వారు గంగా ఘాట్లలో ప్రవిత్ర స్నానమాచరించడంపై నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని కోరారు. (Non-Hindus can’t take a dip) ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో 2027లో అర్ధ కుంభమేళా జరుగనున్నది. ఈ నేపథ్యంలో వీహెచ్‌పీ నాయకురాలు సాధ్వి ప్రాచి మీడియాతో మాట్లాడారు. కుంభమేళా ప్రాంతాన్ని ‘అమృత క్షేత్రం’గా ప్రకటించాలని, హిందువులు కాని వారి ప్రవేశంపై కఠినమైన ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు.
కాగా, ఇటీవల కొంత మంది మహిళలు ఢిల్లీ నుంచి హరిద్వార్‌కు వచ్చి దురుద్దేశంతో పవిత్ర స్నానాలు చేశారని సాధ్వి ప్రాచి ఆరోపించారు. హిందువుల పవిత్ర స్థలాల్లో ఇలాంటి ‘జిహాదీ కార్యకలాపాలు’ కుంభమేళా వంటి మతపరమైన సమ్మేళనాలకు ముప్పు కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు జిహాదీ శక్తులు కుంభ్ ప్రాంతంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి ఒక చట్టాన్ని అమలు చేయాలని సాధ్వి ప్రాచి కోరారు. హిందువులు కాని వారు ఈ ప్రాంతంలో ఆస్తుల కొనుగోళ్లపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మక్కా, మదీనా వంటి ప్రదేశాలలో ముస్లిమేతరులపై ఉన్న ఆంక్షలతో సమాంతరంగా హరిద్వార్‌లో కూడా అలాంటి నిబంధనలు వర్తింపజేయాలని ఆమె అన్నారు.
Also Read:
Watch: రెండో భార్య కావాలంటూ.. వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి వ్యక్తి నిరసన, తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హైవే డివైడర్‌పై థార్‌తో డేంజరస్ స్టంట్లు.. తర్వాత ఏం జరిగిందంటే?