PV Sindhu : ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఆడలేకపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu) కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర భయాందోళన మధ్య దుబాయ్ నుంచి స్వదేశం వచ్చిన సింధు.. స్విస్ ఓపెన్‌లోనూ ఆడకూడదని తీర్మానించుకుంది. మూడు రోజుల దుబాయ్‌లో బిక్కుబిక్కుమంటూ గడిపిన తను.. మానసికంగా, శారీరకంగా సన్నద్ధంగా లేనందునే స్విస్ ఓపెన్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్టు పేర్కొంది.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దుబాయ్‌లో చిక్కుకున్న పీవీ సింధు ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్ పోటీలకు దూరమైంది. మూడు రోజుల తర్వాత స్వదేశం చేరుకున్న తెలుగు తేజం ఇంకా కుదురుకోలేదు. దాంతో.. వెంటనే కోర్టులోకి దిగేందుకు ఆమె సిద్ధంగా లేదు. సో.. స్విట్జర్లాండ్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి వైదొలగాలని సింధు నిర్ణయించుకుంది.
PV Sindhu will miss this year’s All England Championships after being caught in an unexpected travel crisis in Dubai while en route to Birmingham.
Here’s what we know ⏩https://t.co/lAOtBApHxP | 📸AP pic.twitter.com/Z53quoGy1h
— Sportstar (@sportstarweb) March 2, 2026
రెండోసారి కూడా ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కంగుతిన్న లక్ష్య సేన్(Lakshya Sen) సైతం ఈ పోటీల్లో ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. మార్చి 10 నుంచి మొదలయ్యే ఈ ఈవెంట్‌కు తాను అందుబాటులో ఉండడని ఆమె తెలిపింది. స్విట్జర్లాండ్‌లోని సెయింట్ జకొబ్షల్లేలో మార్చి 10వ తేదీ నుంచి మార్చి 15 వరకూ స్విస్ ఓపెన్ జరుగనుంది.