అయ్యో పాపం
మూడేళ్ల పాప గత కొన్ని రోజులుగా ఏడుస్తూ కు టుంబ సభ్యులను కన్నీళ్లు పెట్టిస్తు న్న హృదయ విదారక ఘటన సీ ఎం సొంత జిల్లాలో కలకలం రే పుతోంది. అంగన్వాడీకి వెళ్లిన ఈ పసిపాప కోడిగుడ్ల కోసం ఉడికించిన నీళ్లలో పడి ఒళ్లు కాలి 22 రోజులు అవుతు న్నా అధికార యంత్రా ంగం పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శల కు తావిస్తోంది. వై ద్య ఖర్చులకు డ బ్బులు లేక పసిపాప బాధలు చూడలేక పుట్టెడు దుఃఖంతో ప్రజావాణికి వచ్చి ఫిర్యా దు చేసినా చలనం లేదంటే అసలు రాష్ట్రంలో సర్కారు ఉందా అనే అనుమానం కలుగుతున్నది.
- సీఎం రేవంత్ సొంత జిల్లాలో ఘోరం
- ఆడుకుంటూ వెళ్లి అంగన్వాడీ కేంద్రం వద్ద వేడినీళ్లల్లో పడిన చిన్నారి
- 23 రోజులుగా ఏడుస్తున్న వైనం
- బాలానగర్ మండలం హేమాజీపూర్లో దారుణం
- ఆలస్యంగా వెలుగులోకి ఘటన
- రూ.వేలకు వేలు పెట్టి వైద్యం చేయించలేని స్థితిలో ఫ్యామిలీ
- ఆదుకోవాలని కోరుతున్న కుటుంబం
మహబూబ్నగర్, మార్చి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మూడేళ్ల పాప గత కొన్ని రోజులుగా ఏడుస్తూ కు టుంబ సభ్యులను కన్నీళ్లు పెట్టిస్తు న్న హృదయ విదారక ఘటన సీ ఎం సొంత జిల్లాలో కలకలం రే పుతోంది. అంగన్వాడీకి వెళ్లిన ఈ పసిపాప కోడిగుడ్ల కోసం ఉడికించిన నీళ్లలో పడి ఒళ్లు కాలి 22 రోజులు అవుతు న్నా అధికార యంత్రా ంగం పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శల కు తావిస్తోంది. వై ద్య ఖర్చులకు డ బ్బులు లేక పసిపాప బాధలు చూడలేక పుట్టెడు దుఃఖంతో ప్రజావాణికి వచ్చి ఫిర్యా దు చేసినా చలనం లేదంటే అసలు రాష్ట్రంలో సర్కారు ఉందా అనే అనుమానం కలుగుతున్నది.
కాలిన గాయంతో తీవ్ర అవస్థలు పడుతూ తిండి లేక కన్నీళ్లే ఆహారమై చిక్కి శల్యమవుతున్న ఓ చిన్నారి కథ అందరిని కదిలించి వేస్తుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మం డలం హేమాజీపూర్ గ్రామ శివారు బిల్డింగ్తండాకు చెందిన మూడేళ్ల సాయిశ్రీ అనే పసిపాప ఆడుకుంటూ వెళ్లి అంగన్వాడీ కేంద్రంలో గుడ్లు ఉడకబెట్టిన నీటిలో పడిపోయింది. వేడి నీటి దాటికి శరీరం కాలిపోయి ఆహాకారాలు చేస్తున్న తాపీగా వచ్చిన అక్కడి అంగన్వాడీ సిబ్బంది బయటికి తీసి తల్లిదండ్రులను పిలిపించి పంపించారు.
పసిపాపకు ఒళ్లు కాలిపోయినా కనికరం లేకుండా కనీసం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా తమ నిర్లక్ష్యాన్ని చాటుకున్నారు. దాదాపు శరీ రం వెనుక భాగమంతా కాలిపోయి చిన్నారి బాధ తట్టుకోలేక రోదిస్తున్న దృశ్యం హృదయ విదారకంగా మా రింది. ఫిబ్రవరి 17న ఈ ఘటన జరుగగా సోమవారం నాడు వెలుగులోకి వచ్చింది. బాధ తట్టుకోలేక ఈ చిన్న పాప 23 రోజులుగా ఏడుస్తూనే ఉన్నది. తల్లిదండ్రులు పేద కుటుంబానికి చెందినవారు కావడంతో వైద్యం చేయించేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు.
తమకు తోచిన ప్రైవేట్ దవాఖానలో చికిత్స కోసం వెళితే రూ. వేల ఖర్చవుతాయని చెప్పడంతో చేసేది లేక ఆయిట్మెంట్ అంటించి ఇంటికి తెచ్చామని పాప తండ్రి సుమన్నాయక్ విలపిస్తూ చెప్పాడు. కనీసం ఇలా జరిగిందని తమ బాధ చెప్పుకోవడానికి ప్రజావాణికి వెళ్లి ఫిర్యాదు చేసినా ఒక్క అధికారి కూడా వచ్చి పలుకరించలేదని వాపోయారు. కలెక్టరేట్ మెయిన్ గేట్ మెట్ల దగ్గరే నానమ్మ ఒడిలో ఏడుస్తున్న ఈ చిన్నారి వేదన అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పాపకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు ఈ ఘటనకు కారకులైన అంగన్వాడీ సిబ్బందితోపాటు సంబంధిత అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

