బూర్గంపహాడ్, ఆగస్టు 12 : పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మైనార్టీ నాయకుడు మహమ్మద్ ఖాన్ బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలో మైనార్టీల స్థితిగతులు, ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యేతో చర్చించారు. మైనార్టీల అభ్యున్నతికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన మైనార్టీ యువతకు అందించి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యావసతులు, మౌలిక సదుపాయాల కల్పనకు సహాయ, సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి అన్నివర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, మైనార్టీల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.