Jobs | జైపుర్‌లోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRC) నార్త్ వెస్టర్న్ రైల్వే (NWR) యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 2008 పోస్టులను నింపనుంది. 2026-27 సంవత్సరానికి వీటిని భర్తీ చేయనుంది. అర్హులైన వారు వెబ్సైట్ www.rrcjaipur.inలో అక్టోబర్ 7వ తేదీ నుంచి నవంబర్ 6 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు
అజ్మేర్ (Ajmer)లోని డివిజనల్ రైల్వే మేనేజర్స్ ఆఫీస్- 500
బికనేర్ (Bikaner)లోని డివిజనల్ రైల్వే మేనేజర్స్ ఆఫీస్- 524
జోధ్‌పుర్‌లోని డివిజనల్ రైల్వే మేనేజర్స్ ఆఫీస్- 134
అజ్మేర్లోని BTC క్యారేజ్- 101
అజ్మేర్లోని BTC LOCO- 69
బికనేర్‌లోని క్యారేజ్ వర్క్‌షాప్- 33
జోధ్‌పుర్‌లోని క్యారేజ్ వర్క్‌షాప్- 67
ఈ పోస్టులు జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ కేటగిరీలకు కేటాయించారు.

Railway Posts
ట్రేడులు
ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, డీజిల్ మెకానిక్, మెషినిస్ట్, మేసన్, మెకానిక్, COPA తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా తత్సమానమైన (10+2 విధానంలో) పరీక్షలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు సంబంధిత ట్రేడులో నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) లేదా స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (SCVT) జారీ చేసిన నేషనల్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
డాక్యమెంటేషన్ వెరిఫికేషన్ సమయంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.
వయసు
నవంబర్ 6 నాటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏండ్లు ఉండాలి. ఓబీసీలకు 3, ఎస్సీ, ఎస్టీలకు 5, పీడబ్ల్యూడీలకు 10, ఎక్స్ సర్వీస్మెన్లకు సేవా కాలానికి సంబంధించి అదనంగా 3, గరిష్ఠంగా 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఫీజు
దరఖాస్తు ఫీజు రూ. 100. మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు లేదు.
ఎంపిక
మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
చివరితేదీ
దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 6న ముస్తుంది. దరఖాస్తు, ఇతర వివరాలకు వెబ్సైట్ www.rrcjaipur.in చూడండి.

Apprentice