KTR | వికారాబాద్ జిల్లా అనంతగిరి సమీపంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం, పలువురు గాయపడటం బాధాకరమని కేటీఆర్ అన్నారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులను వెంటనే రక్షించి, అవసరమైన వైద్య సహాయం అందించేందుకు సహాయక చర్యల్లో పాల్గొనాలని స్థానిక బీఆర్ఎస్ నాయకత్వానికి సూచించానని తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న వారికి అవసరమైన సహాయం అందేలా స్థానిక నాయకులు అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు.