MLA Megha Reddy | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలంతా ఒక గుంపు.. మీ గుంపు అంతటికి నేను మేస్త్రీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తనకు తాను ప్రకటించుకున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డితోపాటు మరో గుంపు మేస్త్రీ కూడా చేరిపోయారు. ఇంతకీ ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా..? వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి.
వనపర్తిలోని ఓ వార్దులో పల్లె దవాఖాన ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ.. మన ముఖ్యమంత్రిని పట్టుకుని గుంపు మేస్త్రీ అంటరు.. గుంపు మేస్త్రీ మంచిదే.. కరెక్టే అదేం తప్పు కాదు కదా.. వనపర్తికి నేను గుంపు మేస్త్రీ,, తెలంగాణ రాష్ట్రానికి రేవంతన్న గుంపు మేస్త్రీ అంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Salman Khan | సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’కి క్లియరెన్స్.. త్వరలోనే థియేటర్లలోకి రానుందా?
Breaking News | అనంతగిరి లోయలో పడిపోయిన బస్సు.. నలుగురు మృతి
Abhishek Sharma: పాకిస్థాన్‌పై సిక్సర్లతో చెలరేగిన అభిషేక్ శర్మ