పలువురికి మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పరామర్శ
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు బుధవారం పర్యటించి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గుంటుపల్లి గోపవరానికి చెందిన మందడపు వెంకటేశ్వరరావు...
ఎర్రుపాలెం, ఆగష్టు11 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు బుధవారం పర్యటించి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గుంటుపల్లి గోపవరానికి చెందిన మందడపు వెంకటేశ్వరరావు, భీమవరం గ్రామానికి చెందిన శీలం నాగిరెడ్డి, భవానీపురానికి చెందిన కొండపల్లి రాఘవరావు, బనిగండ్లపాడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జంగా పుల్లారెడ్డి ఇటీవల అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న నేపథ్యంలో వారి స్వగృహాలకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఎర్రుపాలెం మండలానికి చెందిన న్యాయవాది, సీనియర్ పాత్రికేయుడు గంధం శ్రీనివాసరావు తల్లి శకుంతల ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అలాగే రాజులదేవరపాడు గ్రామానికి చెందిన వేమిరెడ్డి పెద్ద శివారెడ్డి ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి యన్నం శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ వేల్పుల బెంజిమెన్, మండల నాయకులు శేగిరెడ్డి శ్రీకాంత్రెడ్డి, గూడూరు రమణారెడ్డి, కోట శ్రీనివాసరావు, సంక్రాంతి కృష్ణారావు, అనుమోలు సాంబశివరావు,షేక్ మస్తాన్ వలి, షేక్ బహదూర్ ఖాన్,గద్దల శ్రీనివాసరావు, రవి, కృష్ణారెడ్డి,వెంకటరెడ్డి, మందడపు నరేష్,లక్కిరెడ్డి అప్పిరెడ్డి, వేమిరెడ్డి పూర్ణ, నాగేశ్వరరావు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

