నర్సాపూర్, సెప్టెంబర్ 15 : నిషేధిత భూముల జాబితాలోనూ చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో ఓ రైతుకు మూ డెకరాలు ఉంటే 3,850 ఎకరాలుగా నమోదుచేశారు. కాగా నిషేధిత జాబితా లో తమ భూములు చేర్చడంపై బాధితు లు తలలు పట్టుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో భూములను అమ్మాల న్నా, కొనాలన్నా ఇబ్బందులు తప్పడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నర్సాపూర్ మండలంలో 14,417.21 ఎకరాలను అధికారులు 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారు. తుజాల్పూర్లో 4706.28 ఎకరాలను నిషేధిత జాబితాలో ప్రభుత్వం చేర్చింది.
గ్రామానికి చెందిన గాలి లక్ష్మీనారాయణకు 3 ఎకరాల 18గుంటల భూమి ఉంటే 5 గుం టలు కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి పోయింది. మిగతా మూడెకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వంలో రెండెకరాలకు మాత్రమే రైతుబంధు వస్తున్నది. మూడెకరాలు ఉన్న గాలి లక్ష్మీనారాయణ పేరుమీద సర్వేనంబర్ 55(అ)లో 3,850 ఎకరాలు 22ఏ కింద నిషేధిత జాబితాలో నమోదైంది. అధికారులు ఎ వరి మెప్పుకోసం ఇలా చేశారనేది తెలియాల్సి ఉన్నది. తహసీల్దార్ శ్రీనివాస్ వివరణ కోరగా.. విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
