‘ఏజెన్సీ గ్రామాల్లో ఇంటింటికీ పోస్టల్ సేవలు’
ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలకు పోస్టల్ శాఖ అందిస్తున్న సేవలను ఇంటింటికీ చేరేలా సిబ్బంది కృషి చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి అన్నారు. గురువారం దుమ్ముగూడెం సబ్ పోస్టాఫీసులో నిర్వహించిన ఇంటింటికీ పోస్టల్ ఖాతా కార్యక్రమంలో..
– ఉమ్మడి ఖమ్మం జిల్లా పోస్టల్ ఎస్పీ వీరభద్రస్వామి
దుమ్ముగూడెం, అక్టోబరు 01 : ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలకు పోస్టల్ శాఖ అందిస్తున్న సేవలను ఇంటింటికీ చేరేలా సిబ్బంది కృషి చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి అన్నారు. గురువారం దుమ్ముగూడెం సబ్ పోస్టాఫీసులో నిర్వహించిన ఇంటింటికీ పోస్టల్ ఖాతా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు పోస్టల్ శాఖ ద్వారా అందుబాటులో ఉన్న వివిధ సేవలపై గ్రామసభలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ గ్రామీణ పోస్టల్ జీవిత బీమా సౌకర్యం కల్పించేలా సిబ్బంది కృషి చేయాలన్నారు. రూ.10 లక్షల వరకు ప్రయోజనం కలిగించే పోస్టల్ ఇన్సూరెన్స్ పాలసీపై ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజలకు అవసరమైన సమయంలో పోస్టల్ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం ఎస్పీఎం రవికుమార్, ఎంఓ సుధీర్, రవి, దుమ్ముగూడెం సబ్ పోస్టాఫీస్ పరిధిలోని బీపీఎంలు, ఏబీపీఎంలు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Trisha | జయలలిత పాత్రలో త్రిష.. ఎంజీఆర్ బయోపిక్‌లో కీలక పాత్రకు ఓకే చెప్పిందా!
Glacial Lake Outburst | భూటాన్‌లో హిమానీనదం విస్ఫోటనం.. బెంగాల్, అస్సాంలకు వరద ముప్పు.. కేంద్రం హైఅలర్ట్..!
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ.. వెంకీ కామెడీకి ప్రశంసలు, త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?
Throat problem | గొంతులో నొప్పి, మంట, గరగర వేధిస్తున్నాయా.. అయితే ఈ వంటింటి చిట్కా మీ కోసమే..!
Vishwak Sen | ఫ్యాన్స్ మీట్ వివాదంపై మరోసారి స్పందించిన విశ్వక్ సేన్.. ఆ రోజు జరిగిన తప్పుకు క్షమాపణలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

