జలంధర్: లుథియానాకు చెందిన వ్యాపారవేత్త ఎస్పీ ఓస్వాల్‌ను డిజిటల్ అరెస్టు(Digital Arrest) చేసి 7 కోట్లు కాజేసిన కేసులో కోల్‌కతాకు చెందిన సోహెల్ అక్తర్ అలియాస్ రాజును కోల్‌కతాలో అరెస్టు చేశారు. జలంధర్‌కు చెందిన ఈడీ అతన్ని అదుపులోకి తీసుకున్నది. మనీల్యాండరింగ్ చట్టం కింద అక్తర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ పేర్కొన్నది. ట్రాన్సిట్ రిమాండ్‌కు కోల్కత్తా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో అతన్ని జలంధర్‌కు తీసుకెళ్లారు. అక్టోబర్ 6 వరకు అతన్ని రిమాండ్‌లోకి తీసుకున్నారు.
ఏడు కోట్ల డిజిటల్ అరెస్టు కేసులో డబ్బులను ఎక్కడికి తరలించారో దర్యాప్తులో తేల్చనున్నారు. లుథియానాకు చెందిన వర్ధమాన్ గ్రూపుకు ఓస్వాల్ చైర్మెన్‌గా ఉన్నారు. 2023 ఆగస్టులో అతన్ని డిజిటల్ అరెస్టు చేశారు. సీబీఐ ఆఫీసర్లమని చెప్పి అతని నుంచి ఏడు కోట్లు వసూల్ చేశారు. లుథియానా సైబర్ క్రైం పోలీసులు రిజిస్టర్ చేసిన కేసులో ఈడీ దర్యాప్తు చేపట్టింది.