Hospital Room | ఆస్పత్రి రూమ్ చార్జీలపై లిమిట్.. పార్లమెంటరీ స్థాయీసంఘం సిఫారసు
Hospital Room | దేశంలోని మెట్రో నగరాల (Metro Cities) లో ప్రైవేటు ఆసుపత్రులు (Private Hospitals) వసూలు చేస్తున్న గది అద్దెలకు పరిమితి విధించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ఆయా ఆసుపత్రుల సమీపంలోని 3-స్టార్ హోటళ్ల (Three star Hotels) సగటు అద్దె కంటే ఈ ఛార్జీలు అధికంగా ఉండకూడదని స్పష్టంచేసింది.
Hospital Room : దేశంలోని మెట్రో నగరాల (Metro Cities) లో ప్రైవేటు ఆసుపత్రులు (Private Hospitals) వసూలు చేస్తున్న గది అద్దెలకు పరిమితి విధించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ఆయా ఆసుపత్రుల సమీపంలోని 3-స్టార్ హోటళ్ల (Three star Hotels) సగటు అద్దె కంటే ఈ ఛార్జీలు అధికంగా ఉండకూడదని స్పష్టంచేసింది. పెరుగుతున్న వైద్య ఖర్చులను అదుపులోకి తీసుకువచ్చి రోగులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కమిటీ ఈ కీలక సూచనలు చేసింది.
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం తన 176వ నివేదికలో ఈ సిఫార్సులను పొందుపరిచింది. ‘ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల అందుబాటు-స్తోమత’ పేరిట రూపొందించిన ఈ నివేదికను ఆగస్టు 7న పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశపెట్టారు. ఆసుపత్రుల్లోని మౌలిక సదుపాయాలు, సేవలను బట్టి గది అద్దెల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని, తక్షణమే వీటిని హేతుబద్ధీకరించాలని కమిటీ సూచించింది. ఈ నిబంధన కేవలం ప్రాథమిక గది అద్దెకే వర్తిస్తుందని, రెసిడెంట్ డాక్టర్, నర్సింగ్, భోజనం ఖర్చులను ఆసుపత్రులు అదనంగా వసూలు చేసుకోవచ్చని స్పష్టంచేసింది.
జాతీయ నమూనా సర్వే (2025) గణాంకాలను కమిటీ ఈ సందర్భంగా ఉటంకించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో సగటు చికిత్స వ్యయం రూ.6,631 గా ఉండగా.. ప్రైవేటు ఆసుపత్రుల్లో అది రూ.50,508గా ఉందని పేర్కొంది. ఉదాహరణకు ముంబైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో సింగిల్ రూమ్ అద్దె రోజుకు రూ.6,000 నుంచి రూ.12,000 వరకు ఉండగా.. సమీపంలోని 3-స్టార్ హోటళ్లలో అది రూ.2,500 నుంచి రూ.4,500 మధ్యే ఉందని నివేదికలో వివరించింది. గది అద్దెలతోపాటు ప్రైవేటు ఆసుపత్రులలోని కీలక చికిత్సలు, వ్యాధి నిర్ధారణ పరీక్షల ధరలను కూడా నియంత్రించేలా ఒక చట్టబద్ధమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది.
చికిత్స ప్రారంభించడానికి ముందే అంచనా వ్యయాన్ని రోగులకు వివరించాలని సూచించింది. అయితే హోటళ్లతో ఆసుపత్రులను పోల్చడం సరికాదని, ఆసుపత్రుల్లోని వైద్య సేవలు, సిబ్బంది, మౌలిక సదుపాయాలు హోటళ్లతో పోలిస్తే భిన్నంగా ఉంటాయని కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుతం ఇవి సలహా పూర్వక సిఫార్సులు మాత్రమే కాగా.. వీటి అమలు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

