జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’. లయ, హృతిక కీలక పాత్రధారులు. ఆకెళ్ల వి.కృష్ణ దర్శకుడు. కిశోర్‌నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మాతలు. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఇంటెన్స్ లుక్‌తో ైస్టెలిష్‌గా కనిపిస్తున్న జగపతిబాబుని ఈ పోస్టర్లో చూడొచ్చు. నీలం, ఎరుపు రంగుల మధ్య విభజించిన అమ్మాయి ముఖం కథలోని మిస్టరీని ప్రతిబింబిస్తున్నది. ఈ చిత్రానికి మాటలు: లక్ష్మీభూపాల, కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: కార్తీక్ బి.కొడకండ్ల, నిర్మాణం: చరిత చిత్ర, ఎస్వీసీఎల్ఎల్పీ.