‘మా ‘సరస్వతి’కి అద్భుతమైన స్పందన వస్తున్నది. ముఖ్యంగా క్లైమాక్స్ చూసి సర్ప్రైజ్ అవుతున్నారు. ఇది విమెన్ సెంట్రిక్ సినిమా మాత్రమే కాదు. ఒక మంచి థ్రిల్లర్. చూసిన వారంతా మెచ్చుకుంటున్నారు. చూడని వాళ్లుంటే చూడండి’ అని వరలక్ష్మి శరత్‌కుమార్ అన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నటించిన హై కాన్సెప్ట్ థ్రిల్లర్ ‘సరస్వతి’. పూజా శరత్‌కుమార్ నిర్మాత. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతున్నదని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో వరలక్ష్మీశరత్‌కుమార్ మాట్లాడింది. ‘సరస్వతి’ లాంటి కథ చెప్పాలంటే ధైర్యం కావాలని, ఇది మనసుల్ని కదిలించే సినిమా అనీ వరలక్ష్మి శరత్‌కుమార్ భర్త నిచోలాయ్ సచ్దేవ్ చెప్పారు. సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నదని నిర్మాత పూజా శరత్‌కుమార్ ఆనందం వెలిబుచ్చారు.