తరుణ్‌భాస్కర్ కథానాయకుడిగా రూపొందుతున్న కామెడీ థ్రిల్లర్ ‘గాయపడ్డ సింహం’. మానసా చౌదరి, ఫరియా అబ్దుల్లా కథానాయికలు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకుడు. సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పవన్ సాదినేని సమర్పకులు. ఈ వేసవిలోనే సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రచారం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఈ సినిమాకు చెందిన ఫన్ ప్రమోషనల్ ర్యాప్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో హీరో అమెరికన్ డ్రీమ్ ఎలా ఒక్కసారిగా తలకిందులవుతుందో ఈ పాట చూపించింది. సంగీత దర్శకుడు స్వీకర్ అగస్తీ స్వయంగా రాసి, స్వరపరిచి ఈ పాట పాడగా, ర్యాప్ పార్ట్‌ని అసుర ఆలపించారు. పాస్‌పోర్ట్‌పై పడే రిజెక్షన్ స్టాంపులు, ట్రంప్ విగ్రహాలు, ‘హ్యాపీ డిపోర్టేషన్’ కేక్ కటింగ్ వంటి సరదా సన్నివేశాలతో ఈ పాట వినోదాత్మకంగా సాగింది. విష్ణు ఓయి, హర్షవర్దన్, శుభలేఖ సుధాకర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విద్యాసాగర్ చింత, నిర్మాతలు: కల్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్‌కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ నిర్మాతలు.