ఎస్సీ గురుకులంలో అవినీతి కంపు
- హెడ్ ఆఫీస్‌లో గుత్తాధిపత్యం
- కారుణ్య నియామకాలు.. బదిలీల్లో విస్తుపోయే అక్రమాలు
- బెనిఫిట్స్ ఇచ్చేందుకు ఆమ్యామ్యాలు
- బిల్లుల చెల్లింపుల్లోనూ వాటాలు
- ఫిర్యాదును పట్టించుకోని సర్కార్
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకుల సొసైటీ ప్రధాన కార్యాలయంలో అవినీతి కంపుకొడుతున్నది. ఏండ్లుగా పాతుకుపోయిన కొందరు ఉద్యోగులదే పూర్తిగా పెత్తనమైపోయింది. పరిపాలనా వ్యవహారాలు, ఉద్యోగుల నియామకాలు, ఉద్యోగోన్నతులు, బదిలీలు, కొనుగోళ్లు, టెండర్లు, బిల్లుల చెల్లింపులు, ఆఖరికి విరమణ ప్రయోజనాలను అందించేందుకూ సైతం ఫైలుకో రేటు పెడుతూ వసూళ్లకు పాల్పడుతున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాల నుంచి తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయమైన ఇప్పటికే పలువురు విజిలెన్స్ విభాగానికి సైతం ఫిర్యాదులు చేశారు. అనేకసార్లు ప్రభుత్వ పెద్దల దృష్టికి సైతం తీసుకెళ్లారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఎస్సీ గురుకుల సొసైటీ ప్రధాన కార్యాలయంలో కీలక స్థానంలోని ఉన్నతాధికారితో కలిపి మొత్తం 8 మంది అధికారులు ఒక గ్రూపుగా ఏర్పడి అవినీతి కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు బాహాటంగా వెల్లడిస్తున్నాయి. అదీగాక సొసైటీ ప్రధాన కార్యాలయంలో ఎస్టాబ్లిష్మెంట్, అడ్మినిస్ట్రేషన్ తదితర విభాగాల్లో దాదాపు 35 మంది వరకు సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నారు.
జూనియర్ అసిస్టెంట్‌గా చేరిన అతిస్వల్పకాలంలోనే సీనియర్ అసిస్టెంట్‌గా, సూపరింటెండెంట్ తదితర కీలకస్థానాలకు చేరినవారున్నారు. సుదీర్ఘకాలంగా ప్రధాన కార్యాలయంలో పాగా వేసి నేడు మొత్తం సొసైటీనే శాసించే స్థాయికి చేరారని ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు వివరిస్తున్నాయి. కొనసాగుతున్న వ్యవహారాలు సైతం అందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. ఉద్యోగోన్నతి పొందిన ఉద్యోగులు సంబంధిత సంస్థల్లోనే విధులు నిర్వహించాల్సి ఉండగా, ప్రధాన కార్యాలయంలో కొనసాగుతున్నారు. వారితోపాటు పాఠశాలలు, కళాశాలల్లో బోధించాల్సిన టీచింగ్ స్టాఫ్ సైతం ప్రధాన కార్యాలయంలోనే వివిధ విభాగాల్లో ఏండ్లుగా కొనసాగుతున్నారు.
సొసైటీ ప్రధాన కార్యాలయంలో ఓ ఉన్నతాధికారిపై అనేక ఆరోపణలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. 317 జీవో సమయంలో జరిగిన బదిలీల్లో భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. సదరు అధికారి తన సమీప బంధువును హైదరాబాద్ పరిధిలోని ఒకే గురుకులంలో దాదాపు 19ఏండ్లుగా కొనసాగిస్తున్నారని చెప్తున్నారు. ఆ అధికారే మరికొందరు అధికారులతో గుంపుకట్టి సొసైటీని శాసిస్తున్నారని, అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఆ వ్యవహారాలు ఎకడ బయటపడతాయోననే ఉద్దేశంతో ఇతరులెవరూ కార్యాలయానికి రాకుండా అడ్డుకుంటున్నారని, బదిలీలు, ప్రమోషన్లను జాప్యం చేస్తున్నారని తెలుస్తున్నది. కార్యదర్శిని సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని, వాస్తవ పరిస్థితులు తెలియకుండా అడ్డుకుంటున్నారని, అనేక ఫైళ్లను తొక్కిపెడుతున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు తెలుపుతున్నాయి.
రద్దు చేసినట్టే చేసి మళ్లీ..
ఎస్సీ గురుకుల సొసైటీలో ప్రధాన కార్యాలయంతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న డిప్యుటేషన్లను గతంలోనే రద్దు చేశారు. విషయాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ స్వయంగా వెల్లడించారు. అంతేకాదు ఆ సందర్భంగానే 6 నెలల్లో సొసైటీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని, డిప్యుటేషన్ పై ఒక అధికారి కూడా లేకుండా చూస్తామని ప్రకటించారు. కానీ ఏడాది దాటినా ఆ మాటలన్నీ నీటిమీది రాతలుగానే మిగిలాయి. డిప్యుటేషన్లను రద్దు చేసినట్టే చేసి ప్రస్తుతం మళ్లీ యథేచ్ఛగా ఎకడికకడ డిప్యుటేషన్లను కల్పిస్తున్న దుస్థితి నెలకొన్నది. అమాత్యుడి పేరిట ఓ ఉన్నతాధికారే అక్రమ వ్యవహారాలన్నీ చకబెడుతున్నారని సొసైటీ మొత్తం కోడై కూస్తున్నది. అమాత్యుడి అండదండలతోనే ప్రస్తుతం డిప్యుటేషన్ల వ్యవహారం కొనసాగుతున్నదని స్పష్టంగా తేలిపోతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

