మేము రైతు బిడ్డలం!
మట్టిని నమ్ముకుని జీవిస్తాము
విత్తును హత్తుకుని ఆనందిస్తాము
గడ్డపార నాగలితో చెలిమిని చేస్తూ
గింజ రాశికి ప్రణమిల్లుతాము
మొదటి తరగతి నుంచి
చదువు చివరి అంచు వరకూ
మొలిచిన పంటనే నమ్ముకుంటాము
చెమట చిందిస్తూ చెట్టును పెంచి
తెగులు నివారణకై
కాసుల మూటను కుమ్మరిస్తాము
కూలీల ఖర్చు చేంతాడంత పొడవైనా
మౌనంగా నొప్పిని భరిస్తాము
అరువు కాళ్లను పట్టుకుని
ఎరువులు కొని మట్టిలో కలిపేస్తాము
మెతుకులకైనా
సంసారపు అతుకులకైనా
ఆ మట్టినే నమ్ముకుని జీవిస్తాము
రైతు ఉన్నాడని ఎవరైనా గుర్తిస్తే
ఎగిరి గంతేస్తూ సంతోషపడతాము
దళారీ వ్యవస్థలో అవస్థలు పడుతూ
పరిస్థితిని పరీక్షించుకుంటాము
రాశి పోసిన పంట నాసిరకమైతే
లోలోపల దుఃఖం దిగమింగుతాము
రేటుకు రాని పంటను నమ్ముకుని
పూటపూటకూ తలచుకుంటాము
రైతును మరిచిన సర్కార్‌కు
అప్పుడప్పుడూ రుణపడతాము
మేము రైతు బిడ్డలం
దేశానికి వెన్నెముకలం
-నరెద్దుల రాజారెడ్డి .9666016636
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

