ఆత్మవిశ్వాసమే అసలైన అందం
‘ఫిట్నెస్ కోసం ప్రతిరోజూ భారీ బరువులు ఎత్తడమంటే నాకు చిరాకు. వ్యాయామం అనేది ఆరోగ్యంతోపాటు మనసుకు ఆహ్లాదాన్ని కూడా ఇవ్వాలి. నాట్యం, యోగా, క్రీడలు.. ఇవన్నీ ఫిట్నెస్తో పాటు ఆనందాన్ని కూడా ఇస్తాయి.
‘ఫిట్నెస్ కోసం ప్రతిరోజూ భారీ బరువులు ఎత్తడమంటే నాకు చిరాకు. వ్యాయామం అనేది ఆరోగ్యంతోపాటు మనసుకు ఆహ్లాదాన్ని కూడా ఇవ్వాలి. నాట్యం, యోగా, క్రీడలు.. ఇవన్నీ ఫిట్నెస్తో పాటు ఆనందాన్ని కూడా ఇస్తాయి. ముఖ్యంగా నాట్యాన్ని మించిన వ్యాయామం మరొకటి లేదు’ అంటున్నారు అందాలభామ శ్రీలీల. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో తన వ్యక్తిగత అభిరుచుల గురించి చెప్పుకొచ్చారు శ్రీలీల. ‘దుస్తుల విషయంలో ట్రెండీగా ఉండాలని అనుకోను.
నా దృష్టిలో ఆత్మవిశ్వాసమే అసలైన అందం. అందుకే సింపుల్‌గా ఉండటానికే ఇష్టపడతా. అప్పుడప్పుడు చీరలోనూ, ఆధునిక దుస్తుల్లోనూ కనిపిస్తూ ప్రయోగాలు చేస్తుంటా’ అని అందంగా నవ్వారు శ్రీలీల. ఇంకా చెబుతూ ‘నా వ్యక్తిగత జీవితం గురించి రకరకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఓ బాలీవుడ్ నటుడితో ముడిపెడుతూ కొన్ని వార్తలు ఇటీవల బాగానే సర్క్యూలేట్ అయ్యాయి. వాటిని నేను పెద్దగా పట్టించుకోను. నాకు నా పనే ముఖ్యం. అయితే.. అలాంటి పుకార్లకు మా అమ్మ బాగా సమాధానం చెబుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది శ్రీలీల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

